ఇంతకీ జూ.ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగులో ఎప్పుడు పాల్గొంటాడు? ఆ విషయంపైన క్లారిటీ లేదు కాని.. ఇప్పుడు ఈ కొత్త సినిమా తాలూకు బిజినెస్ డిటైల్స్ చూస్తే మాత్రం అవాక్కైపోవాల్సిందే. ఆల్రెడీ కె.ఎస్.రవీంద్ర డైరక్షన్లో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఆరంభమై.. మనోడు లేకుండానే షూటింగ్ కూడా జరిగిపోతోంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాను గంపగుత్తగా కొనేసుకోవడానికి ఒక ప్రొడ్యూసర్ ముందుకొచ్చాడట. మొత్తంగా ప్రపంచవ్యాప్త ధియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపేసి 85 కోట్లకు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమా ఏకంగా 81 కోట్ల షేర్ పట్టుకొచ్చింది కాబట్టి.. ఈ సినిమాకు దానికంటే ఓ ఐదు పెట్టడానికి కూడా రెడీగానే ఉన్నారు కొందరు నిర్మాతలు. విశేషం ఏంటంటే.. ఇలాంటి దిమ్మ తిరిగే ఆఫర్ ఇచ్చినా కూడా కళ్యాణ్ రామ్ దీనిని తిరస్కరిస్తున్నాడట. ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఒప్పుకోవట్లేదు.
ఆల్రెడీ తన గత సినిమాలతో నష్టపోయిన పంపిణీదారులకు ఈ సినిమాను ఇచ్చేద్దాం అనుకుంటున్నాడట కళ్యాణ్ రామ్. అందుకే ఇప్పుడు ఇలా ఒక నిర్మాతకే మొత్తంగా రైట్స్ అమ్మేస్తే.. రేపు అతను తనను నమ్ముకున్న పంపిణీదారులకు ఇవ్వకపోతే కష్టం కాబట్టి.. కళ్యాణ్ రామ్ కాస్త ఆలోచనలో పడ్డాడనేది టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/