క్లాసిక్ రీమేక్ లో ఫైట్స్ ఇరికించాలట!

Update: 2020-02-22 14:30 GMT
ఆయన ఓ పెద్ద స్టార్.. కొంత గ్యాప్ తర్వాత మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే తన స్టైల్ కు ఇమేజికి పెద్దగా సూటు కాని సామాజికం అంశంతో కూడిన ఒక కథ ఎంచుకోవడంతో ఆ హై బడ్జెట్ వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి.  ఇదిలా ఉంటే ఈ సినిమాకు హిందీ యూట్యూబ్ రైట్స్ కోసం పెద్దగా ఆఫర్లు రావడం లేదని నిర్మాత తెగ ఇదైపోతున్నాడట.

సినిమా రీమేక్ కాబట్టి హిందీ రైట్స్ కు డిమాండ్ తక్కువ ఉండడం కొంతవరకూ అర్థం చేసుకోవచ్చు కానీ డబ్బింగ్ రైట్స్ ఐదు కోట్లు కూడా  పలకకపోవడం మరీ పరువు తక్కువ సమస్యగా మారిందట. తెలుగులో సరిగ్గా ఒక్క సాలిడ్ హిట్ కూడా లేని యువ హీరో నటించిన సినిమాల హిందీ రైట్స్ విలువ పదికోట్లకు పైగా ఉందని.. ఇంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి కనీసం ఐదు కోట్లు కూడా రాకపోతే ఎలా అని నిర్మాత ఆలోచన  చేస్తున్నాడట.  యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటేనే డబ్బింగ్ రైట్స్ ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయని.. అందుకే ఈ సినిమాలో ఫైట్స్ ను ఏదో విధంగా ఇరికించమని దర్శకుడిపై నిర్మాత ఒత్తిడి చేస్తున్నాడట.

అదసలే క్లాసిక్ సినిమా. సామాజిక కథాంశంతో సీరియస్ గా సాగే కథనం.. హీరోయిజం ఉండదు. అలాంటి సినిమాకు ఈ యాక్షన్ పార్ట్ జోడించి కిచిడి చెయ్యడం ఎందుకనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.  ఏదేమైనా ఈ స్టార్ హీరో సినిమాకు ఆయన అభిమానులు అనుకున్నంత స్థాయిలో క్రేజ్ లేదని టాక్ వినిపిస్తోంది. ఆయన మార్కెట్ మునుపటిలాగే ఉందా లేదా దెబ్బతిన్నదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News