వందల కోట్ల పెట్టుబడి. అందులోనూ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్. ఆకాశమే హద్దుగా అంచనాలు. టాలీవుడ్ స్పీల్ బర్గ్ గా కీర్తించబడే రాజమౌళి దర్సకత్వం. ఆర్ ఆర్ ఆర్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది కానీ ఇదంతా నిర్మాత డివివి దానయ్య ఒక్కడే డీల్ చేయడం ఇప్పటికే పరిశ్రమలో ఎందరికో ఈర్ష్య పడేలా చేసిన మాట వాస్తవం. ఇది వదులుకుంటే వంద కోట్లు నెట్ ఇస్తామని తనకు కొందరు ఆఫర్ చేశారని దానయ్య ప్రెస్ మీట్ లో చెప్పడం కొన్ని నెలల క్రితం సంచలనం రేపింది.
ఇదిలా ఉండగా ప్రొడక్షన్ తో పాటు బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాల్లో దానయ్యకు రాజమౌళి కి మధ్య ఏవో విభేదాలు వచ్చాయనే టాక్ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. బయటికి చెప్పకపోయినా నివురు గప్పిన నిప్పులా కొన్ని ఇష్యూస్ అంతర్గతంగా వచ్చాయని వినికిడి. వీటిని పరిష్కరించేందుకు రాజమౌళి సన్నిహితుడు నిర్మాత సాయి కొర్రపాటి రంగంలోకి దిగినట్టు మరో అప్డేట్. ఎన్టీఆర్ బయోపిక్ షాక్ తర్వాత బయట కనిపించడం తగ్గించేసిన సాయి అంతకు ముందు కేజిఎఫ్ కు వచ్చిన లాభాలు దీంతో పోగొట్టుకున్నట్టు అయ్యింది.
ఆర్ ఆర్ ఆర్ లాంటి ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న అపార్థాలు మిస్ కమ్యునికేషన్లు జరగడం సహజం కాబట్టి జక్కన్నతో పాటు దానయ్యను కూర్చోబెట్టి ఈయన మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా తెలిసింది. ఇది నిజమని చెప్పే ఆధారాలు లేవు కాని దీని ప్రభావం నిర్మాణం మీద పడకుండా ఓ అండర్ స్టాండింగ్ తో అయితే ఉన్నారట. మరి ఈ పుకారు రావడానికి మూల కారణం ఏమిటో కాని షూటింగ్ మొదలయ్యాక ఇద్దరు హీరోలు గాయపడటం ఇప్పుడీ గాసిప్స్ కు రెక్కలు రావడం అభిమానులకు ఆందోళన కలిగించేదే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న టీం త్వరలో కీలకమైన షెడ్యూల్ కోసం అహ్మదాబాద్ వెళ్లనుంది