త్రిష బ‌హిష్క‌ర‌ణ‌.. అంత త‌ప్పేం చేసింది?

Update: 2020-02-23 05:00 GMT
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ప‌ట్టుద‌ల‌కు పోయి బుక్క‌యిందా? అంటే అవున‌నే తాజా స‌మాచారం. పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న చందంగా ఈ అమ్మ‌డు సౌత్ స్టార్ హీరోయిన్ల‌లో న‌య‌న‌తార విధివిధానాల గురించి తెలిసిందే. ఏ సినిమా ప్ర‌మోష‌న్ కు హాజ‌రయ్యే అల‌వాటు లేదు. న‌యన్ ఏ సినిమా చేసినా ఆ చిత్ర నిర్మాత‌తో ముందుగానే ఆ విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. నిర్మాత‌లు ఎంత ప‌ట్టుబ‌ట్టినా ..ప్ర‌చారానికి ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌న్నా .. న‌య‌న్ మాత్రం నో అనేస్తుంది. ఎంత పెద్ద‌ స్టార్ హీరో అయినా ఆ ఒక్క‌ విష‌యంలో మెట్టు దిగ‌దు. న‌య‌న్ కు మాత్ర‌మే అలా చెల్లుతుంది. ఇత‌ర‌ హీరోయిన్లకు అయితే  అంత సీన్ ఉండ‌దు. అయితే మ‌రి త్రిష కూడా న‌య‌న‌తార‌లా మారాల‌నుకుంటుందో ఏమో గానీ త్రిష చేసిన ప‌నికి కోలీవుడ్ నిర్మాతల మండ‌లి ఓ రేంజులోనే సీరియ‌స్ అయ్యింది.

సినిమా ప్ర‌చారానికి హాజ‌రు కాక‌పోతే తీసుకున్న పారితోషికంలో సగం నిర్మాత‌కు వెన‌క్కి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అలా కుద‌ర‌ని ప‌క్షంలో ప‌రిశ్ర‌మ నుంచి బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌ద‌నే వార్నింగ్ ఇచ్చింది. ఇంత‌కీ ఏ సినిమా విష‌యంలో ఇలా చేసింది? అంటే .. త‌న కెరీర్ 60వ చిత్రంగా రూపొందుతున్న `ప‌ర‌మ‌ప‌దం విళ్లైయాట్టు` ప్ర‌మోష‌న్స్ కి డుమ్మా కొట్టింద‌ట‌. 24 హౌస్ ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై ద‌ర్శ‌క‌ నిర్మాత తిరుజ్ఞానం ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈనెల 28న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో  శ‌నివారం చెన్నై స‌త్యం థియేట‌ర్ లో ప్ర‌చార కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ ప్ర‌చారానికి యూనిట్ స‌భ్యులంతా హాజ‌ర‌య్యారు గానీ త్రిష మాత్రం రాలేదు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ కామాక్షి అనే నిర్మాత త్రిష‌పై ఆగ్ర‌హంతో ఊగిపోయారు. స్టార్ హీరోలు ర‌జ‌నీకాంత్..క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్లే  ఎంత బీజీగా ఉన్నా..కొంత స‌మ‌యం కేటాయించి ప్ర‌చారానికి స‌హ‌క‌రిస్తారు. కానీ హీరోయిన్లు మాత్రం ప్ర‌చారానికి ఎందుకు దూరంగా ఉంటారో అర్ధం కాదు. స్టార్ హీరోల క‌న్నా బిజీ షెడ్యూల్స్ వాళ్ల‌కు ఉంటున్నాయో ఏమిటో అంటూ సైటెర్ వైశారు. సీనియ‌ర్ హీరోయిన్ల‌తో సినిమాలు చేస్తే ప్ర‌చారం ల‌భిస్తుంద‌ని ఆశించి నిర్మాత‌లు వాళ్ల‌ను తీసుకుంటున్నారు. లేక‌పోతే కొత్త వాళ్ల‌నే  తీసుకుంటారు క‌దా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సీనియ‌ర్ భామ‌లు ఈ ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే కొత్త వాళ్ల‌తోనే సినిమాలు చేస్తాం. అప్పుడేం చేస్తారో.. ఇండ‌స్ట్రీలో ఎన్నాళ్లు ఇలా అవ‌కాశాలు వ‌ద్ద‌నుకుంటారో చూస్తాం అంటూ హెచ్చ‌రించారు. అలాగే నిర్మాత‌ల మండ‌లి ఈసీ కీల‌క మెంబ‌ర్ శివ .. త్రిష చ‌ర్య‌ను ఖండించారు. త‌దుప‌రి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోతే.. తీసుకున్న పారితోషికంలో సగం వెన‌క్కి తిరిగి ఇవ్వాల‌ని లేక‌పోతే మండ‌లి ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అయితే నిర్మాత‌తో త్రిష లాలూచీ ఎక్క‌డ చెడిందో త‌న వెర్ష‌న్ ఏమిటో తెలియాల్సి ఉంది. తాజా వార్నింగుల‌కు త్రిష రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News