రిలీజ్‌ డేట్‌ మారుస్తారా? అంత సీన్‌ లేదు

Update: 2015-12-05 05:23 GMT
ఏదైనా పెద్ద సినిమా రిలీజ్‌ కి వ‌స్తోంది అంటే, ఇక చిన్న సినిమాల‌న్నీ మూటా ముళ్లు స‌ర్ధుకోవాల్సిందే. థియేట‌ర్లు దొరక్క అల్లాడిపోయే ప‌రిస్థితి. అస‌లు చిన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో తెలీని ధీన‌మైన ప‌రిస్థితి ఉందిప్పుడు.  పైగా పెద్ద సినిమాల్ని ముందే ప్ర‌క‌టించిన టైముకి రిలీజ్ చేయ‌కుండా వాయిదాలు వేస్తూ ఇత‌ర సినిమాల‌కు సంకెళ్లు వేయ‌డం అనే వింతైన ప‌రిస్థితి మ‌న‌కు ఉంది. భారీ బ‌డ్జెట్ సినిమాల్ని ప‌దే ప‌దే వాయిదాలు వేస్తూ రిలీజ్ చేయ‌డం వ‌ల్ల చిన్న నిర్మాత‌లంతా అయోమ‌యంలో ప‌డి కొట్టుకుపోవాల్సొస్తోంది.

ఇటీవ‌లి కాలంలో బాహుబ‌లి - శ్రీ‌మంతుడు - రుద్ర‌మ‌దేవి - అఖిల్ .. లాంటి సినిమాలు రిలీజ్‌ లు వాయిదా ప‌డి ఇత‌ర సినిమాల్ని తుంగ‌లో తొక్కేశాయి. వీటివ‌ల్ల చిన్న సినిమాకి - ఎగ్జిబిట‌ర్ల‌కు బోలెడంత న‌ష్టం వాటిల్లింది. అందుకే ఇప్పుడు నిర్మాత‌ల‌మండ‌లి - ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌లు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇక‌నుంచి ఏదైనా పెద్ద సినిమా ముందుగా ప్ర‌క‌టించిన తేదీకే రిలీజ్ కావాలి. అలా కాని ప‌క్షంలో క‌నీసం మూడు నాలుగు వారాల గ్యాప్ తీసుకుని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల ముందే స్ర్టీమ్‌ లైన్‌ లో ఉన్న చిన్న సినిమాల‌న్నీ ఆ గ్యాప్‌ లో రిలీజైపోతాయి.

జ‌న‌వ‌రి 1, 2016 నుంచి ఈ ప‌ద్ధ‌తి అమ‌ల్లోకి వ‌స్తోంది. రిలీజ్‌ ల‌కు ఇక డెత్‌ బెల్ మోగిన‌ట్టే. ఇష్టం వ‌చ్చిన‌ట్టు రిలీజ్ చేస్తామంటే ఇక ఊరుకునేదే లేదు. బాలీవుడ్‌ - కోలీవుడ్‌ లో లానే ఇక నుంచి చ‌చ్చిన‌ట్టు చెప్పిన టైమ్‌ కి రిలీజ్ చేయాల్సిందే. అంతా మ‌న మంచికే. పైగా పెద్ద సినిమాల ప్రభావంతో చిన్న సినిమాలు నాశనం కాకుండా ఉంటాయిప్పుడు. మరి రిలీజ్‌ డేట్‌ తో గేమ్స్‌ ఆడుకునే బాబాయ్‌ లూ.. ఇక కాస్కోండి.
Tags:    

Similar News