సౌత్ లోనే కాదు యావత్ భారతదేశంలోనే దర్శకుడు శంకర్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమా జెంటిల్ మెన్ మొదలుకుని రోబో దాకా తనకు మాత్రమే సాధ్యమయ్యే టేకింగ్ తో విజువల్ గ్రాండియర్స్ ను రూపొందించే శంకర్ రూపొందిస్తున్న 2.0 అత్యంత ఖరీదైన ఇండియన్ మూవీగా నిర్మాణంలోనే రికార్డులు సృష్టిస్తోంది. అలాంటి శంకర్ ను ఒక సీనియర్ కమెడియన్ ముచ్చెమటలు పోయించడం అంటే చిన్న విషయం కాదుగా. శంకర్ తాను దర్శకత్వం వహించే సినిమాలే కాకుండా విడిగా స్వంత బ్యానర్ మీద మీడియం బడ్జెట్ సినిమాలు తీస్తాడన్న సంగతి తెలిసిందే. అలా రూపొందిన ప్రేమిస్తే లాంటి మూవీస్ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. అదే సిరీస్ లో వడివేలు హీరోగా శంకర్ గతంలో హింసించే 23వ రాజు పులికేశి అనే సినిమా రూపొందించాడు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో ఓ మాదిరిగా ఆడింది.
ఇన్నాళ్ల తర్వాత దీని సీక్వెల్ కి శ్రీకారం చుట్టాడు శంకర్. కంటిన్యూ కాబట్టి వడివేలునే హీరోగా తీసుకున్నాడు. తీరా కాల్ షీట్స్ ఇచ్చి కొన్ని రోజులు షూటింగ్ అయ్యాక వడివేలు సినిమా చేయను పో అని మొండికేసాడు. కారణం తాను చెప్పిన వారిని టీమ్ లో పెట్టుకోకపోవడం ఒకటైతే తన ఇమేజ్ కు తగ్గట్టు చెప్పిన కొన్ని మార్పులు దర్శకుడు శింబుదేవన్ చేయకపోవడం. దీంతో ఒళ్ళు మండిన శంకర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసాడు. సరే వివరణ అడుగుదామని వడివేలుని పిలిపిస్తే రివర్స్ లో ముందు తనకు రావాల్సిన కోటి శంకర్ నుంచి ఇప్పించండని అడిగాడట. దీంతో సీరియస్ అయిన నిర్మాతల సమాఖ్య ఎటువంటి షరతులు లేకుండా వెంటనే షూటింగ్ కు రావాలని లేదా ఆలస్యం వల్ల శంకర్ నష్టపోయిన 8 కోట్ల దాకా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు వడివేలు దీనికి ఒప్పుకుని షూటింగ్ లో పాల్గొంటాడా లేదా అనేది కోలీవుడ్ టాక్ గా మారింది. ప్రేమికుడు సినిమా ద్వారా వడివేలుకు కొత్త ఇమేజ్ క్రియేట్ చేసింది శంకరే. అలాంటిది శంకర్ కే ఇలా చేయటం పట్ల వడివేలు మీద పరిశ్రమలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది