బిగ్ బాస్ బ్యూటీపై విరుచుకుపడిన నెటిజన్స్...!

Update: 2020-05-10 00:30 GMT
'ఉయ్యాలా జంపాలా' 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' తదితర చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన పునర్నవి భూపాలం 'పిట్టగోడ' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ - 3 లో ఎంట్రీ ఇచ్చి బొద్దు బొద్దు అందాలతో బిగ్ బాస్ హౌజ్ ని హీటెక్కించింది పున్నూ. ముక్కుసూటిగా తనకు నచ్చని పనిని నచ్చలేదని చెప్తూ ప్రేక్షకులను ఆకర్షించింది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ బిగ్ బాస్ కే చమటలు పట్టించింది. వెండితెర మీద కనిపించినా రాని క్రేజ్ ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ హౌజ్‌ తెచ్చిపెట్టింది. ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోయిన్ ఛాన్స్‌ ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. సింగర్ రాహుల్ - పునర్నవి ఎఫైర్ అంటూ వస్తున్న రూమర్స్ వల్ల మీడియా వర్గాల్లో పున్నూ హాట్ టాపిగ్‌ గా మారింది. లాక్ డౌన్ లో అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను హీటెక్కించే ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంది పునర్నవి. అయితే పునర్నవి ఒక ఇష్యూపై స్పందించిన కారణంగా ఆమె సోషల్ మీడియా నుండి దూరమయ్యే పరిస్థితి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో 'బోయిస్ లాకర్స్ రూమ్' అనే ఇష్యూ హాట్ టాపిక్‌ గా నడుస్తున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కొందరు సంపన్న టీనేజ్ కుర్రాళ్లు సోషల్ మీడియా మాధ్యమాలైన ఇన్ స్టాగ్రామ్ - ఫేస్ బుక్‌లలో 'బోయిస్ లాకర్స్ రూమ్' పేరుతో గ్రూప్‌ క్రియేట్ చేసి ఇందులో అమ్మాయిలు అస్లీల చిత్రాలతో పాటు వాళ్ల గురించి శృంగార టాక్, అమ్మాయిల మార్ఫింగ్ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా అమ్మాయిల్ని బలవంతం చేయడానికి ప్లానింగ్, గ్రూప్ శృంగారం మొదలైన అంశాలపై చర్చిస్తున్న చాట్‌ లు బయటకు రావడంతో ఈ ఇష్యూ నేషనల్ వైడ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఈ ఇష్యూని సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు సంబంధించి ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ లను అదుపులోకి తీసుకుని కేసు కూడా నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి స్పందిస్తూ.. 'సోషల్‌ మీడియాలో పిల్లలు ఎలా ఉండాలో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే' అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్‌ పెట్టింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

''పిల్లలు స్కూల్ కి వెళ్లిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారో పేరెంట్స్ కి ఎలా తెలుస్తుంది.. ఇలాంటి వికృత చేష్టలు వారు ఎక్కడి నుండి నేర్చుకుంటారో పేరెంట్స్ కి ఎలా తెలుస్తుంది.. అనవసరంగా తల్లిదండ్రులను బ్లమ్ చేయొద్దు'' అంటూ కామెంట్స్ పెట్టారు. వీటిపై స్పందించిన పునర్నవి భూపాలం.. 'తాను పేరెంట్స్‌ ని బ్లేమ్ చేసేలా మాట్లాడలేదని.. తాను సోషల్ మీడియాలోకి వచ్చింది ఒకర్ని దూషించడానికి కాదని' పోస్ట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో కొంతకాలం పాటు యాడ్‌ స్టోరీ పోస్టులను షేర్‌‌ చేయనని తెలిపారు. 'ఇన్‌స్టాగ్రామ్‌ అనేది కొన్ని సార్లు విషపూరితమైన సాధనం. నేను పూర్తిగా ఇన్‌స్టా నెగిటివిటీతో విసిగిపోయాను. మళ్లీ కొత్తగా జీవం పోసుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని పోస్ట్ పెట్టి ఇన్స్టాకి దూరమైంది పున్నూ. వాస్తవానికి సోషల్ మీడియాలో అందరూ మన అభిప్రాయాలను గౌరవించాలని లేదు. నీ ఒపీనియన్ వారికి నచ్చనంత మాత్రాన అది నెగిటివిటీ అని ఫీల్ అయితే ఎలా పున్నూ..!
Tags:    

Similar News