కన్నడ పరిశ్రమలో పవర్ స్టార్ గా అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. అతంటి అభిమాన నటుడు ఇంత చిన్న వయసులోనే మరణించడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు లక్షలాది మంది అభిమానుల సమక్షంలో కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో కొద్దిసేపటి క్రితం పూర్తి అయ్యాయి. కంఠీరవ స్టేడియం నుంచి పునీత్ అంతిమయాత్రను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా జరిగింది. సంప్రదాయ రీతిలో పునీత్ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
పునీత్ రాజ్ కుమార్ తెలుగువాడు కాకపోయినా.. తెలుగులో నటించకపోయినా అతడిని మనవాడిలా భావించి తెలుగు వాళ్లందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మన ఇండస్ట్రీ జనాలు కూడా పునీత్ మరణం నేపథ్యంలో స్పందించిన తీరు కన్నడిగులను కదిలించింది. చిరంజీవి, బాలక్రిష్ణ, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థీవదేహాన్ని సందర్శించారు. నివాళి అర్పించారు. పునీత్ ను టాలీవుడ్ ఇలా ఓన్ చేసుకొని అతడి మరణం పట్ల స్పందించిన తీరును కన్నడ ప్రజలు కొనియాడు.. ఇదే సమయంలో తమిళ హీరోలు ఒక్కరూ రాలేదని.. వారు స్పందించిన తీరు దారుణం అంటూ వారిపై ఆగ్రహంతో ట్రోల్స్ చేస్తున్నారు.
తెలుగుతోపాటు తమిళ చిత్రాలు కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున విడుదలవుతుంటాయి. భారీగా వసూళ్లు రాబడుతుంటాయి. పునీత్, తమిళ స్టార్ల పట్ల కూడా తన అభిమానాన్ని చాటుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. అతడికి చాలామంది తమిళ హీరోలతో అనుబంధం ఉంది.కానీ తమిళ హీరోలెవరు పునీత్ ను కడసారి చూపు కోసం బెంగళూరుకు రాకపోవడంపై ఇప్పుడు కన్నడ ప్రజలు, సినీ అభిమానులు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు హీరోలు పునీత్ కు నివాళులర్పించిన ఫొటోలను షేర్ చేస్తూ కన్నడ ప్రజలు.. తమిళ హీరోలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. వారిపై విరుచుకుపడుతున్నారు. తమిళ హీరోల సినిమాలను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్టోబర్ 29న ఉదయం జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పలకూలిపోయాడు పునీత్. గుండెపోటుతోనే మరణించాడని డాక్టర్స్ తేల్చి చెప్పేసారు. గుండెపోటుతో అర్థాంతరంగా కన్నుమూసిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పునీత్ రెండో అన్న కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ చేతులమీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు.ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది. దీనికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మంత్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులు,తోటి నటీనటులు హాజరయ్యారు.