‘ప‌వ‌ర్ స్టార్‌’ అంటే పవన్ మాత్రమేః క‌న్న‌డ స్టార్ హీరో

Update: 2021-06-18 09:30 GMT
‘ప‌వ‌ర్ స్టార్‌..’ ఈ పేరులోనే ఏదో తెలియ‌ని మ్యాజిక్ ఉంటుంద‌ని చెబుతారు ఫ్యాన్స్. ఈ సౌండ్ వినిపిస్తే చాలు.. త‌మ‌ను తాము మైమ‌ర‌చిపోతారు. పూన‌కాల‌తో ఊగిపోతారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అభిమానులు ఉండ‌రు.. భ‌క్తులు మాత్ర‌మే ఉంటార‌ని అన్నాడు డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్. త‌న చిత్రాల ద్వారా ఫ్యాన్స్ ను అంత‌లా అల‌రిస్తుంటారు ప‌వ‌న్‌.

ఇక‌, సినిమాల్లో ఆయ‌న చేసిన రియ‌ల్ స్టంట్స్‌.. ప‌వ‌ర్ స్టార్ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. తొలి సినిమాలోనే చేతుల మీదనుంచి కార్లు పోనిచ్చుకోవ‌డం.. గుండెల‌పై బండ‌లు ప‌గ‌ల గొట్టించుకోవ‌డం వంటి స్టంట్స్ తో మెస్మ‌రైజ్ చేశారు. ఆ విధంగా ప‌వ‌ర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కు నిజ‌మైన అర్హుడు అని కూడా అనిపించుకున్నాడు. తాజాగా.. ఇదే విష‌యాన్ని క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ స‌ర్టిఫై చేశారు.

క‌న్న‌డ కంఠీర‌వ‌గా వెలుగొందిన సీనియ‌ర్ హీరో రాజ్‌కుమార్ త‌న‌యుడే పునీత్ రాజ్‌కుమార్‌. చైల్డ్ ఆర్టిస్టుగానే శాండ‌ల్ వుడ్ లోకి ప్ర‌వేశించిన పునీత్‌.. బాల న‌టుడిగా స‌త్తా చాటాడు. ఏకంగా జాతీయ అవార్డును కూడా ద‌క్కించుకున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ‘ఇడియ‌ట్‌’ రీమేక్ తో కన్నడ నాట స్టార్ హీరో అయిపోయాడు. ఈ చిత్రం అక్క‌డ కూడా దుమ్ములేప‌డంతో పునీత్ తిరుగులేని స్టార్ అయ్యాడు.

అయితే.. ప‌లు సినిమాల్లో ప‌వ‌ర్ ఫుల్ రోల్స్ ప్లే చేయ‌డంతో.. అక్క‌డి అభిమానులు ఆయ‌న‌ను ‘ప‌వ‌ర్ స్టార్‌’ అని పిలుస్తూ వచ్చారు. కాల క్రమంలో మీడియా కూడా అదేవిధంగా రాస్తూ వచ్చింది. అయితే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పునీత్ మాట్లాడుతూ.. ‘ప‌వ‌ర్ స్టార్’ అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు మాత్ర‌మేన‌ని అన్నారు. ఇక మీదట తనను పవర్ స్టార్ అని పిలవొద్దంటూ.. పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.

‘‘పవన్ కల్యాణ్ సార్ ను నేను చాలా సార్లు కలిశాను. ఆయ‌న ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు. ఆయ‌న చాలా మంది అభిమానుల‌ వ్య‌క్తి. అందుకే ప‌వ‌ర్ స్టార్ అయ్యారు’’ అని కొనియాడారు. దీంతో.. ఈ ఇంట‌ర్వ్యూ వైర‌ల్ అయ్యింది. పునీత్ రాజ్ కుమార్ ను ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
Tags:    

Similar News