చనిపోయాక రికార్డ్ సాధించిన పునీత్.. ఏంటంటే?

Update: 2021-12-12 05:31 GMT
కన్నడ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న సమయం లోనే పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం కన్నడ ప్రజలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆయన మరణించి ఇన్ని రోజులు గడుస్తున్నా పునీత్ అభిమానులు మాత్రం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. అక్టోబర్ 29న ఆయన గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇంత చిన్న వయసులోనే మరణించడం కన్నడ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టింది.

కేవలం కన్నడ ఇండస్ట్రీ మాత్రమే కాదు ఆయన అకాల మరణ వార్త విని యావత్ భారత దేశం అంత షాక్ అయ్యారు. అన్ని ఇండస్ట్రీల ప్రజలు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన మరణ వార్త విని దిగ్బ్రాంతి చెందారు. మన టాలీవుడ్ సినీ ప్రముఖులు స్వయంగా ఆయన పార్ధివదేహాన్ని చివరి సారి చూసేందుకు అక్కడి వెళ్లారు.

మన తెలుగు ప్రజలు కూడా ఆయన మరణం పట్ల స్పందించారు. అయితే ఈయన మరణించిన తర్వాత రికార్డ్స్ సాధిస్తున్నాడు పునీత్. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆయన చేసిన సేవలకు గాను కర్ణాటక అత్యుత్తమ పురస్కారం అయినా బసవ శ్రీ పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక రికార్డ్ సాధించాడు పునీత్.

2021 సంవత్సరం మరొక 15 రోజుల్లో పూర్తి అవ్వబోతుంది. ప్రతి ఏడాది ఈ సమయంలో గూగుల్ టాప్ లో సెర్చ్ చేసిన వారి లిస్టును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా గూగుల్ టాప్ సెర్చ్ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ప్రకటిస్తుంది. గూగుల్ ప్రకటించిన లిస్టులో పునీత్ కూడా ఉన్నాడు. ఈ విషయం విన్న పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్ ప్రకటించిన దాని ప్రకారం 2021 లో అత్యధికంగా వికీపీడియాలో వెతికిన పర్సన్స్ లిస్టులో పునీత్ రాక్ కుమార్ ఉన్నట్టు తెలిపింది. ఈయన మరణించిన తర్వాత ఆయన గురించి తెలుసు కోవాలని చాలా మంది ప్రజలు ఆయన గురించి సెర్చ్ చేసారు. ఆ లిస్టులో పునీత్ టాప్ ప్లేస్ లో ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. దీంతో పునీత్ అభిమానులు కొంచెం ఆనందంగా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు.
Tags:    

Similar News