ఛార్మి-పూరి అంతా హంబ‌క్కేనా?

Update: 2019-06-09 16:28 GMT
రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్‌ తెర‌కెక్కిస్తున్న `ఐస్మార్ట్ శంక‌ర్` స్క్రిప్టు లీక‌వ్వ‌డంతో సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ని నిన్న‌టిరోజున‌ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. డ‌బ్బు చెల్లించ‌క‌పోతే మొత్తం స్క్రిప్టును ఆన్ లైన్ లో లీక్ చేస్తానంటూ ఛార్మి- పూరీల‌నే బెదిరించార‌ని ప్ర‌చార‌మైంది. ముర‌ళి కృష్ణ అనే  టెకీ ఈ స్క్రిప్టును ఇన్ స్టాలో ఓ ప్ర‌త్యేక‌మైన సాఫ్ట్ వేర్ ఆధారంగా లీక్ చేస్తాన‌ని బెదిరించ‌డంతో అత‌డితో రాజీ బేరం కోసం ప్ర‌య‌త్నించార‌ని అన్ని మీడియాల్లో ప్ర‌ధానంగా వార్త‌లొచ్చాయి.

అయితే ఈ ప్ర‌చారం అంతా ఉత్త‌ ప్ర‌చార‌మేన‌ని తేలింది. ఇదంతా ప‌బ్లిసిటీ జిమ్మిక్కు! అని తాజాగా సామాజిక మాధ్య‌మాల్లో ట్రోల్స్ స్టార్ట‌య్యాయి. ``మా డిజిట‌ల్ టీమ్ కి ఇప్ప‌టికే చెప్పాం. మేం ఆ పోస్టుల్ని తొల‌గించాం.. అమాయ‌కులం అని ప్రూఫ్ ఉంది .. అయినా ఇలా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తారా? అంటూ పూరి - ఛార్మి బృందం మీడియాకే రివ‌ర్స్ కౌంట‌ర్ ఇస్తూ ఓ పోస్ట‌ర్ ని రివీల్ చేయ‌డం చూస్తుంటే .. వీళ్ల‌కు ప‌బ్లిసిటీ పిచ్చి పీక్స్ లో ఉంద‌ని అంద‌రికీ ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇక‌పోతే అంత పెద్ద స్క్రిప్టును ఇన్ స్టాలో లీక్ చేయ‌డం సాధ్య‌మా? అంటూ మ‌రో లాజిక్  గురించి తాజాగా ఆస‌క్తిక‌ర‌ డిబేట్ సాగుతోంది.

మొత్తానికి అదేదో కావాల‌నే క్రియేట్ చేసినదా? అంటూ సినీ మీడియాలోనూ చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల వివాదంతో ప్ర‌చారం బాగా వ‌ర్క‌వుట‌వుతోంది. అందుకే ఇలా చేశారా? అంటూ ముచ్చ‌టించుకున్నారంతా. అయితే అందుకోసం సైబ‌ర్ క్రైమ్- ఫిర్యాదులు అంటూ ఎందుకీ హడావుడీ? ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ఎందుకు? అన్న ప్ర‌శ్నలు వినిపిస్తున్నాయి. అయినా సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ ఇలాంటి ప్ర‌చారాలు ఎంత‌వ‌ర‌కూ హిట్టిస్తాయి? అన్న‌ది ఛార్మి బృందం ప‌రిశీలించాల్సి ఉంటుంది. ఐస్మార్ట్ శంక‌ర్ లో మ్యాట‌ర్ ఎంత‌? అన్న‌దే ఇంపార్టెంట్. మ్యాట‌ర్ తో కాకుండా జిమ్మిక్కుల‌తో కొట్టేస్తామంటే కుదురుతుందా మ్యాడ‌మ్ గారు.. సార్ గారూ!!


Tags:    

Similar News