దర్శకుడు పూరీ జగన్నాథ్ కి కొన్ని ప్లేస్ లంటే మహా మక్కువ. గోవా - బ్యాంకాక్.. ఇలా కొన్ని ఏరియాలు సెట్ చేసుకుని.. చాలా సినిమాలు అక్కడక్కడే తీస్తుంటాడు. అయితే తన మేకింగ్ లో ఆయా లొకేషన్స్ మరీ రిపీట్ అయ్యాయనే ఫీలింగ్ ఏ మాత్రం రానివ్వడు. ఇలా పూరీకి అచ్చొచ్చిన ఏరియాల్లో గోల్కొండ కోట కూడా ఒకటి. అప్పట్లో పోకిరి మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ ఇక్కడే తీశాడు.
ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో కలిసి చేస్తున్న ఇజం షూటింగ్ కోసం మళ్లీ గోల్కొండనే ఫిక్స్ చేసుకుని.. అక్కడే ఫైటింగ్ సన్నివేశాలను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. మళ్లీ పోకిరి రేంజ్ హిట్ కొట్టాలన్నది పూరీ ప్లాన్. అయితే పూరీ బ్యాంకాక్ ని వదిలేసి మళ్లీ గోల్కొండకి రావడమే ఇక్కడ పాయింట్. ఇజం మూవీని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హీరోగా ఎంత ఖర్చుపెడతాడో.. ప్రొడ్యూసర్ గా అంత ప్లానింగ్ గా ఉండడం కళ్యాణ్ రామ్ స్పెషాలిటీ.
ఫైట్ సీక్వెన్స్ కోసం బ్యాంకాక్ కంటే.. అచ్చొచ్చిన గోల్కొండ బెస్ట్ అని కళ్యాణ్ రామ్ చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. పైగా ఈ మధ్య పూరీకి కూడా బ్యాంకాక్ మీద కాన్సంట్రేషన్ తగ్గిందిలెండి. రోగ్ చిత్రం కోసం అన్నేసి నెలలు బ్యాంకాక్ లోనే ఉన్నాడు కదా.. ఆ ఎఫెక్ట్ అయుంటుంది.