టాలీవుడ్ లో అతి వేగంగా సినిమాను పూర్తి చేసే దర్శకులేవరంటే తడుముకోకుండా టక్కున వినిపించే పేరు పూరి జగన్నాథ్. కథ ఎంత పెద్దదైనా స్టార్ హీరో చేసినా పూరి మాత్రం అనుకున్న టైంకె తక్కువ రోజుల్లోనే షూటింగ్ ముగించేస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే రాసుకున్నది మాత్రమే తీసి బడ్జెట్ లోనే సినిమా తీసే అతి తక్కువ మంది దర్శకుల్లో పూరి ది బెస్ట్.
అయితే ఇది మొన్నటి వరకూ మాట ఇప్పుడు అందరు దర్శకుల్లాగా మారబోతున్నాడు పూరి. నెక్స్ట్ విజయ్ తో చేస్తున్న సినిమాకు ఎక్కువ షూటింగ్ డేస్ తీసుకోనున్నాడని తెలుస్తుంది. అవును ఈ సినిమా షూటింగ్ దాదాపు వంద రోజులకు పైగానే సాగనుందట. మార్షల్ ఆర్ట్స్ - బాక్సింగ్ లతో కూడిన యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండటం వల్ల భారీ టెక్నీషియన్స్ పనిచేయనున్న కారణంగా బెస్ట్ అవుట్ పుట్ కోసం షూటింగ్ డేస్ పెంచక తప్పట్లేదట. మరో వైపు నిర్మాత కరణ్ జోహార్ కూడా ఎంత సమయం తీసుకున్నా పరవాలేదు బట్ బెస్ట్ సినిమా తీయాలని పూరి - చార్మీ కి పదే పదే చెప్తున్నాడట. ఇక సినిమా కూడా సమ్మర్ కి అనుకున్నా అప్పటికి రాకపోవచ్చని గట్టిగా వినబడుతుంది. దసరా లేదా దీపావళి కి వచ్చే చాన్స్ ఉన్నట్లు టాక్.
పైగా ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి చేస్తున్న సినిమా కావడం , మరో వైపు క్రేజీ కాంబో అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవన్నీ అందుకోవాలంటే పూరి ఈ సారి తన స్టైల్ మార్చి ఎక్కువ రోజులు తీసుకొని సినిమాను చెక్కడం తప్పదు. మరి పూరి ఇకపై కూడా ఇదే మైంటైన్ చేస్తాడా లేదా తన పాత ఫార్మేట్ లోకి వెంటనే వచ్చేస్తాడా చూడాలి.