సినిమా చకచకా తీసుకుంటూ వెళ్లిపోవడం ఎలాగో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు తెలిసింతగా ఇంకెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. అందుబాటులో ఉన్న రిసోర్స్ ను వాడేసుకుని వాటితోటే షూటింగ్ కంప్లీట్ చేసేయగలడు. మొత్తానికి చాలా తక్కువ టైంలో ప్లాన్ చేసిన బడ్జెట్ లోనూ సినిమా కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ చేతిలో పెడతాడు. ఈ తరహా వర్క్ ఆ మధ్య బాగానే వర్కవుట్ అయింది. కానీ ఈమధ్య అన్నీ వరసగా ఫ్లాపులే ఎదురవుతున్నాయి.
బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా తరవాత పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టే పనిలో పడ్డాడు. మెహబూబా పేరుతో ఓ కొత్త తరహా ప్రేమకథతో మూవీ మొదలెట్టాడు. హిల్ స్టేషన్ బ్యాక్ గ్రౌండులో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఇందుకోసం సినిమా యూనిట్ మొత్తం బయలుదేరి హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. అక్కడ మైనస్ మంచు కురుస్తుండగా.. మైనస్ టెంపరేచర్ నమోదవుతున్న సమయాన షూటింగ్ చేస్తున్నారు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించకపోవడంతో గజగజ వణుకుతూనే పని కంటిన్యూ చేస్తున్నారు. పూరీ స్టయిల్ లోనే చెప్పాలంటే అక్కడి వెదర్ దూల తీర్చేస్తోంది.
హీరోయిన్ గా అవకాశాలు తగ్గినప్పటి నుంచి పూరితోటే ఉంటూ అతడి ప్రొడక్షన్ పనులు చూస్తున్న ఛార్మి మెహబూబా చిత్ర యూనిట్ కష్టాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ్ముడిని హీరోని చేయడానికి ఎంతో ప్రయత్నించి విఫలమైన పూరి తన కొడుకును మాత్రం హీరోగా క్లిక్ చేయాలని సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. చూద్దాం.. ఇప్పుడు షూటింగ్ కోసం పడుతున్న కష్టం తెరపై ఎంతవరకు కనిపిస్తుందో..