రామ్ గోపాల్ వర్మ- పూరి జగన్నాధ్ గురు- శిష్యులు అన్న సంగతి తెలిసిందే. పేరుకు గురు శిష్యులు అయినా ఇద్దరిమధ్యా పాలు నీళ్లలా కలసిపోయే స్నేహం ఉంది. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. కానీ పూరీ .. రామూ కంటే కాస్త డిఫరెంట్ గా..సమాజంతో కలిసిపోతాడు. అందుకే అతడు బయోపిక్ లపై దృష్టి సారిస్తున్నాడు.
రీసెంటుగా మేటి కథానాయిక - పొలిటీషియన్ రోజా జీవిత చరిత్ర తెరకెక్కుతుందంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.. రోజా హీరోయిన్ కాక ముందు వ్యక్తిగత జీవితం.. ఆ తర్వాత సంగతులు..అటుపై రాజకీయ నాయకురాలిగా ఎదిగిన తీరు.. ఇవన్నీ హైలైట్ చేస్తూ తెరపై ఆవిష్కరిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. అయితే ఆ బాధ్యతను పూరి తీసుకుంటున్నాడని సమాచారం. అదీ వర్మ సలహా మేరకే అని అనుకుంటున్నారు. పైగా పూరి కూడా రోజా ఫ్యామిలీకి క్లోజ్ అని ఓ టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే రోజా ఆటోబయోగ్రఫీని తెరకెక్కించే ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. ఈ విషయంలో రోజానే స్వయంగా పూరిని సంప్రదించారు. దాంతో పూరీ కూడా ఓకే చేశాడని వార్తలు వస్తున్నాయి.
ఆ మధ్య ఛార్మి హీరోయిన్ గా జ్యోతిలక్ష్మి సినిమా తెరకెక్కించాడు. ఇది ఊహాత్మకమే అయినా సమాజం అనే కోణంలో.. పూరి రాసుకున్న స్టోరీ ఇది. అంటే ఇదీ ఓ బయోపిక్ లాంటి కథే. ఇప్పుడు నేరుగా రోజా జీవితాన్నే తెరకెక్కించడానికి పూరి సన్నద్ధం అవుతున్నాడు. గతంలో రోజా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన గోలీమార్ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.