మీడియా పై పడనున్న 'ఇడియట్' బ్యాచ్!

Update: 2017-09-24 03:51 GMT
డ్రగ్ ఇష్యూలో ఇరుక్కొని మీడియా హాడావుడితో అప్ సెటైన పూరీ జగన్నాథ్ త్వరలోనే మీడియా పై ఓ సెటైరికల్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. సిట్ ఆఫిసులో ఏం జరిగిందో తెలుసుకోకుండా తన పై తప్పుడు ప్రచారం చేసినందుకు పూరీ హార్ట్ అయిన సంగతి తెలిసిందే. తన బాధను ఓ వీడియో  ద్వారా కూడా బయటకు ప్రకటించాడు పూరీ. అయితే ఇంతటితో దీనికి పూరీ ఫుల్ స్టాప్ పెట్టదలుచుకోలేదట, తన చిరకాల మిత్రుడు - డ్రగ్ కేసులో తనతో పాటు ఇరుక్కొని పీకల్లోతు సమస్యలతో సతమతమవుతున్న రవితేజ హీరోగా ప్రస్తుతం మీడియా వ్యవహరిస్తున్న శైలిని ఎండగడుతూ ఓ వ్యంగ్య చిత్రాన్ని రూపొందిచేందుకు పూరీ సన్నాహాలు చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు డ్రగ్ కేసుల్లో ఇరుక్కొని సిట్ ఆఫీస్ చుట్టూ తిరిగిన నటీనటులంతా ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ చేసిన పూరీ - త్వరలోనే అధికారికంగా ఈ సినిమాకి సంబంధించిన వివరాల్ని ఆధికారికంగా ప్రకటిస్తారని సినీ జనాలు చెబుతున్నారు. దీంతో ఇడియట్ బ్యాచ్ మీడియా పై సెటైర్లు వేయడానికి నడుం బిగించిందనే కామెంట్స్ ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్ లో తెగ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా అఫిషియల్ గా ఎనౌన్స్ అయ్యే వరకు నిజమని తేల్చలేము, కానీ పూరీ సన్నిహితులు మాత్రం కచ్ఛితంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందని అంటున్నారు. మరి పూరీ మైండ్ లో ఏం ఉందో లెట్స్ వెయిట్ అండ్ సీ!
Tags:    

Similar News