చిరు లేకుండా మెగా ఫంక్షన్??

Update: 2015-11-28 16:44 GMT
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ లోఫర్. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ని డిసెంబర్ 7న నిర్వహించి, మూవీని 18న రిలీజ్ చేయనున్నారు. అయితే.. ఈ మెగా ఫ్యామిలీ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవిని పిలవడం లేదన్నది టాలీవుడ్ లేటెస్ట్ హాట్ టాపిక్.

లోఫర్ ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రెబెల్ స్టార్ ప్రభాస్ అటెండ్ కానున్నాడని తెలుస్తోంది. శిల్పకళావేదికలో జరగనున్న ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుంచి కేవలం వరుణ్ తేజ్ తండ్రి నాగబాబుకు మాత్రమే ఆహ్వానం అందిందని తెలుస్తోంది. మెగాస్టార్ లేకుండా ఆడియో ఫంక్షన్ చేయాలన్నది పూరీ ఆలోచనగానే చెప్పుకుంటున్నారు. దీనికి పక్కా రీజన్ కూడా అనుకుంటున్నారు. మెగాస్టార్ 150వ చిత్రానికి తనే డైరెక్షన్ చేయబోతున్నాడని పూరీ స్వయంగానే ప్రకటించాడు. ఆ తర్వాత స్క్రిప్ట్ ప్రాబ్లెం వచ్చి, ఇది అటకెక్కేసింది. ఈ విషయాన్ని తనతో చెప్పకుండా.. ముందు మీడియాతో చెప్పారని పూరీ కాస్త అసహనం కూడా వ్యక్తం చేశాడు గతంలో.

చిరు కాకపోతే తన ఫేవరేట్ ప్రభాస్ అని రీసెంట్ గా అనౌన్స్ చేశాడు వరుణ్ తేజ్. అయితే వరణ్ చెప్పింది వేరే సందర్భంలో. ఇప్పుడు అదే నిజం చేయాలని ఆలోచిస్తున్నాడట పూరీ. నిజానికి మెగాస్టార్ లేకుండా, ఆయన కనుసన్నల్లో కాకుండా.. మెగా ఈవెంట్ ఏదన్నా జరుగుతుందని అనుకోవడానికి లేదు. ఇప్పుడు కొడుకు సినిమా అయిన లోఫర్ ఫంక్షన్ కి నాగబాబు తప్పకుండా హాజరవుతాడు. మరి అన్నయ్య అంటే అమితమైన భక్తి చూపించే నాగబాబు.. దీనికి ఒప్పుకున్నారో లేదో ఇప్పటికైతే చెప్పలేం. ఒక వేళ పూరీ ఇలా మెగాస్టార్ లేకుండా ఫంక్షన్ చేయాలని అనుకోవడమే సాహసంగా చెప్పాలి. మరి ఇందులో వాస్తవాలు ఎన్నో ? ఫంక్షన్ రోజుకు జరగబోయే మార్పులెన్నో ?
Tags:    

Similar News