బద్రి, పోకిరి లాంటి సూపర్ హిట్ చిత్రాలను మనకు అందించిన పూరి జగన్నాధ్ కు గత కొంత కాలం ఒక్క హిట్ కూడా లేకుండా పోయింది. బాలకృష్ణ తో చేసిన పైసా వసూల్ పై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇపుడు పూరి తన తనయుడు ఆకాష్ ను హీరో గా టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇండియా కు చెందిన అబ్బాయి, పాకిస్థాన్ ను చెందిన ఒక అమ్మాయి కి మధ్య సాగే అందమైన ప్రేమ కథే మెహబూబా. ఈ సినిమా లో ఆకాష్ పూరి హీరో గా పరిచయం కాబోతుండగా - నేహా శెట్టి హీరోయిన్ గా చేసింది. అసలే హిట్లు లేవు కాబట్టి, ఎంత తొలి సినిమా అయినా - మెహబూబా పైన ఏమాత్రం అంచనాలు లేవు అనటం వాస్తవమే. ఇలా ఉండగా, ఏ మధ్య విడుదల అయిన టీజర్ చూశాక పూరి అద్భుతమైన దర్శకత్వానికి అందరూ ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. అసలు పూరి యేనా తీసింది అన్న విధంగా ఉంది. ఇండియా-పాక్ బోర్డర్ బాక్ గ్రౌండ్ లో ఆశ్చర్యపరిచే గ్రాఫిక్స్ వర్క్స్ తో పూరి ఒక్కసారిగా సినిమా పై అంచనాలను ఆకాశానికి ఎత్తేసాడు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. షూటింగ్ త్వరలో పూర్తి అవబోతున్న ఈ ప్రేమ కావ్యం సమ్మర్ లో మన ముందుకు రాబోతోంది.
ఇప్పటిదాకా 33 సినిమాలు తీసినా - అవన్నీ ఒక ఎత్తు - ఇప్పట్నుండి ఒక ఎత్తు అన్నట్టు ఉంది టీజర్. కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించినా - ఎవరితోనూ ఇంత అద్భుతంగా సినిమా చేయలేదు అన్న మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. కానీ ఒక్కసారిగా పూరి లో ఇంత మార్పు ఎలా వచ్చింది? కొడుకు సినిమా అది కూడా మొట్టమొదటి సినిమా అని ఇంత ఫోకస్ చేసి బాగా తీశారు అని ఫాన్స్ అంటున్నారు. మీరేమంటారు?