టైటిల్స్ విషయంలో పూరీ జగన్నాథ్ ని మొనగాడు అనాల్సిందే. సింపుల్ గా క్యాచీగా తన సినిమాలకు టైటిల్స్ సెట్ చేయడంలో మాస్టర్స్ చేసేశాడు పూరీ. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో పూరీ తీస్తున్న కొత్త సినిమాకు ఇజం అనే టైటిల్ డిసైడ్ చేశాడు. ఆ టైటిల్ డిజైనింగ్ లోనే కమ్యూనిజం - హీరోయిజం - పర్సనలిజం - జర్నలిజం - హీరోయిజం.. ఇల అనే ఇజం లను నింపాడు. వీటిన్నిటితో పాటు మరో 'ఇజం' కూడా తెలుగు జనాలకు బాగా తెలుసు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో.. పవనిజం బాగా పాపులర్ అయింది. దీనికి మించి 'ఇజం' అనే పేరుతో పవన్ ఓ బుక్ ని తనే రాసేసి రిలీజ్ చేశాడు కూడా. సినీ మేథావిగా భావించే రామ్ గోపాల్ వర్మ కూడా ఇజం పుస్తకం చదివి.. అందులో ఏముందో అర్ధం కాలేదని చెప్పిన విషయం తెలిసిందే. అసలు ఈ పుస్తకం రాసిన పవన్ కైనా అర్ధమయిందో లేదో అని కూడా కామెంట్ చేశాడు. రెండేళ్ల క్రితం పవర్ స్టార్ ఇజం అనే పేరుతో బుక్ ఇస్తే.. జనాల్లో బాగా నానిన ఈ వర్డ్ ని తన సినిమా టైటిల్ చేసేశాడు పూరీ జగన్నాథ్.
పూరీ సినిమాల్లో హీరో పాత్రకు హీరోయిజం విపరీతంగా ఉంటుంది. మరి ఏకంగా ఇజం అనే టైటిల్ పెట్టి సినిమా తీసేస్తున్నాడు. అందులోనూ అతనికి చంపడానికి ఓ స్టోరీ కూడా ఉందని ట్యాగ్ లైన్స్ పెట్టాడు. ఈ టైటిల్ తో చాలా స్పీడ్ గా తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో పూరీ బాగానే సక్సెస్ అయ్యాడని చెప్పాలి.