ఇటీవల కాలంలో వారం రోజుల్ని మించి హడావుడి చేసే సినిమాలు చాలా అరుదు. ఆ తర్వాతి వారం మరో కొత్త బొమ్మ పడిపోయిందంటే ఇక మన సినిమా మరుగున పడిపోయినట్టే లెక్క. అందుకే వీకెండ్స్ కలెక్షన్లు చూసుకొని ఆ తర్వాత నిర్మాతలే వదిలేస్తుంటారు. ఇక ఎంత గింజుకొని ప్రమోషన్ చేసినా పెద్దగా ఫలితం ఉండదని నమ్ముతుంటారు. అయితే పూరి జగన్నాథ్ మాత్రం ఇటీవల తాను తీసిన `లోఫర్`ని ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. విడుదలై వారాలు గడుస్తున్నప్పటికీ, కొత్త సినిమాలు బోలెడన్ని థియేటర్లలో పడిపోతున్నప్పటికీ పూరి మాత్రం లోఫర్ని ఇంకా బలంగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. ఒక సినిమాని తీసేశాడంటే ఇక మళ్లీ దాని గురించి పెద్దగా ఆలోచించని పూరి ఇలా లోఫర్ కోసం సక్సెస్ టూర్లు - సక్సెస్ మీట్లలో పాల్గొనడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పరిశ్రమ వర్గాలు మాత్రం పూరి ఇలా చేయడానికి ఒక బలమైన కారణమే ఉందని చెబుతున్నాయి.
లోఫర్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒకట్రెండు మినహా దమ్మున్నవి ఏమీ లేవు. మరోపక్క క్రిస్ మస్ హాలీడేస్ - సంక్రాంతి ఫీవర్ స్టార్ట్ అయ్యింది. దీంతో థియేటర్లు కళకళలాడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకే లోఫర్ని బలంగా ప్రమోట్ చేయాలని పూరి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మెగా కథానాయకుడు నటించిన సినిమా కావడం, మాస్ ప్రేక్షకుల కన్ను ఈ పోస్టర్ పై ఆటోమేటిగ్ గా పడుతుండటం, దానికి తోడు సినిమాలోనూ మహిళల్ని ఆకట్టుకొనే సెంటిమెంట్ ఉండటంవంటివన్నీ ప్లస్సులుగా మారాయి. అందుకే క్రిస్ మస్ సీజన్ ని, న్యూఇయర్ హడావుడిని సొమ్ము చేసుకోవాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. వరుణ్ తేజ్ శుక్రవారం జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలాగే ఈ రోజు కూడా పూరి తన కార్యాలయంలో పెద్దయెత్తున ప్రెస్ మీట్ ఏర్పాటుచేశాడు. సో.. ఈ వీకెండ్ ని లోఫర్ గట్టిగానే ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడన్నమాట.