లోఫర్ ఎఫెక్ట్ తో ఇప్పుడు మాంచి కసిమీద ఉన్నాడు పూరి జగన్నాధ్. ఇప్పటికిప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం పూరీకి లేదు కానీ.. సిట్యుయేషన్ మాత్రం అలాగే డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైతే ఆపసోపాలు పడుతూ తెలుగు-కన్నడలో రూపొందిస్తున్న రోగ్ ను కంప్లీట్ చేసేందుకు కష్టపడుతున్నాడు పూరీ.
ఆపసోపాలు అని ఎందుకు అనాలంటే.. సినిమాకి హీరోయిజం చూపించడానికి హీరో ఎంత ముఖ్యమో, గ్లామర్ వడ్డించడానికి హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. కానీ పాపం పూరీ రోగ్ కి హీరోయిన్ మాత్రం సెట్ అవడం లేదు. ఇప్పటివరకూ చాలానే పేర్లు వినిపించాయి. అమైరా దస్తూర్ - ఐషా శర్మ - పూజా ఝవేరీలను ఫైనల్ చేశారని అన్నారు. ఐషా శర్మతో అయితే.. బ్యాంకాక్ లో దాదాపు సగం సినిమా కూడా తీసేశారు. కానీ ఆమె గుడ్ బై చెప్పేయడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రాని ఫైనల్ చేసేశారని అంటున్నారు. బ్యాంకాక్ లో ఈమెతో షూటింగ్ కూడా మొదలైపోయింది.
అయితే ఈమె అయినా నిలబడుతుందని ఎవరకూ అనుకోవడం లేదు. ఎందుకంటే.. ఇప్పటికి ముగ్గురిని మార్చేయడమే అసలు కారణం. మరి వాళ్లెందుకు వెళ్లారో, ఈమెందుకు వచ్చిందో, వచ్చి ఎన్నాళ్లుంటుదో.. అసలు ఉంటుందో లేదో అన్నది మాత్రం ఇంకా క్వశ్చనే. అసలు పూరీ సినిమాల్లో హీరోయిన్లకు బోలెడు క్రేజ్ వస్తుందనే పేరుంది. మరి కొత్త హీరో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతమంది ఎందుకు వెళ్లిపోతున్నారబ్బా?