ఇది పూరికి మాత్రమే చెల్లు

Update: 2015-09-30 11:30 GMT
పూరి జగన్నాథ్ కు రిస్కులు కొత్తేమీ కాదు. ఆయన కెరీర్ లో ఉన్నన్ని ఎత్తు పల్లాలు ఇంకెవరి కెరీర్ లోనూ ఉండవు. నాగార్జున లాంటి స్టార్ హీరోతో చేస్తాడు.. ఆ వెంటనే తమ్ముడు సాయిరాం శంకర్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోతో హిట్టిస్తాడు. ఆ వెంటనే ఛార్మితో కలిసి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తాడు. అందుకే పూరీకి డాషింగ్ డైరెక్టర్ అని పేరు. ఐతే కెరీర్ లో ఇంతకుముందు చేసిన రిస్కులన్నీ ఒక ఎత్తు కానీ.. ఇప్పుడు చేయబోతున్న రిస్క్ మరో ఎత్తు. ఈ మధ్య బర్త్ డే సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ లో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. ఇషాన్ అనే కొత్త కుర్రాడిని టాలీవుడ్‌ కు పరిచయం చేయబోతున్న సంగతి వెల్లడించాడు పూరి.

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీస్తే మహాత్మ ప్రొడ్యూసర్ సి.ఆర్.మనోహర్ కొడుకని తేలింది. ఐతే ‘టెంపర్’తో ఫామ్ లోకి రావడంతో చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్న పూరి.. ‘జ్యోతిలక్ష్మీ’ లాంటి సినిమా తీయడం వల్లే చిరు సినిమాకు దూరమయ్యాడన్న అభిప్రాయం ఉంది టాలీవుడ్ లో. మరి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఓ పేరులేని కుర్రాణ్ని పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు పూరి. దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖల్ గౌడతో కూడా కన్నడలో ఓ సినిమా తీయబోతున్నట్లు చెప్పాడు. ఓవైపు మహేష్ బాబు - అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ లకు కథలు రాస్తున్నట్లు చెబుతూనే.. మరోవైపు ఇలాంటి పేరులేని హీరోలతో సినిమాలు చేయాలనుకోవడం పూరీకే చెల్లింది.
Tags:    

Similar News