రాజమౌళి తెరకెక్కించిన RRR, ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన `కేజీఎఫ్ 2` చిత్రాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రితిలో భారీ వసూళ్లని రాబట్టాయి. RRR దాదాపుగా 1200 కోట్ల వరకు వసూళ్లని సాధిస్తే..యష్ నటించిన `కేజీఎఫ్ 2` అంతకు మించి అన్నట్టుగా 1250 కోట్లు వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ రెండు చిత్రాల తరువాత యావత్ దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న మూవీ `పుష్ప 2`.
అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ రూపొందించిన `పుష్ప ది రైజ్` దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించి భారీ వసూళ్లని రాబట్టింది. కరోనా కారణంగా హడావిడిగా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేసిన ఈ మూవీ కరెక్ట్ గా ప్రమోట్ చేసి వుంటే రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టేది.
అయినా కూడా ఈ మూవీ ఉత్తరాదిలో రికార్డులు తిరగరాసి ఆశ్చర్యపరిచింది. ఈ మూవీకి సీక్వెల్ గా `పుష్ప ది రూల్` ని త్వరలో తెరపైకి తీసుకురాబోతున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ తో పాటు బడ్జెట్ పై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఆగస్టు మూడవ వారం నుంచి ప్రారంభించబోతున్నారట. ఇదిలా వుంటే ఈ మూవీ బడ్జెట్ కి సంబంధించిన కీలక అప్ డేట్ తాజాగా బయటికి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ కోసం మేకర్స్ 375 కోట్లు లేదా 400 కోట్లు ఖర్చు చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్ఆయి. అయితే ఈ మూవీ కోసం మేకర్స్ 350 కోట్ల బడ్జెట్ ని కేటాయించబోతున్నారని తెలిసింది.
`పుష్ప`కు హిందీ మార్కెట్ లో భారీ క్రేజ్ ఏర్పడటంతో హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ పార్ట్ 2 కోసం పారితోషికాన్ని భారీగా పెంచేశారట. అంతే కాకుండా `కేజీఎఫ్ 2` ని బ్లాస్టింగ్ హిట్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ `పుష్ప 2` బడ్జెట్ ని భారీగా పెంచేశారట. హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషన్ లు కూడా పెరగడంతో ఈ మూవీ బడ్జెట్ ని 350 కోట్లకు పెంచేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఫస్ట్ పార్ట్ కోసం దర్శకుడు సుకుమార్ 18 కోట్లు తీసుకున్నారట. పార్ట్ 2 కోసం ఏకంగా 45 నుంచి 50 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇక బన్నీ కూడా హిందీ రైట్స్ తో కలిపి 90 కోట్లు డిమాండ్ చేశాడని చెబుతున్నారు. అంటే దర్శకుడు, హీరో పారితోషికాలే 140 కోట్ల వరకు తీసుకుంటున్నారని, ఇక టెక్నిషియన్, నటీనటుల రెమ్యునరేషన్ లు కూడా పెరగడంతో సినిమా బడ్జెట్ భారీగా పెరిగిందని ఇన్ సైడ్ టాక్.
ఫస్ట్ పార్ట్ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో `పుష్ప 2` హిందీ రైట్స్ కోసం బాలీవుడ్ కు చెందిన భారీ ప్రొడక్షన్ కంపనీలు పోటీపడుతున్నాయట. కానీ మేకర్స్ మాత్రం ఫస్ట్ పార్ట్ విషయంలో జరిగిన పొరపాట్లని జరగనీవ్వకుండా డబ్బింగ్ రైట్స్ ఇవ్వకుండా షేర్ రూపంగా డీల్ ని కుదుర్చుకోవాలనుకున్నారట. దీనికి ఏ సంస్థ ముందుకొస్తుందో చూడాలి.