అవతార్-2 రిలీజ్ డే రోజున పుష్ప‌-2!

Update: 2022-11-12 07:30 GMT
జేమ్స్ కామోరూన్ విజువ‌ల వండ‌ర్ 'అవ‌తార్-2' ది వే ఆఫ్ వాట‌ర్ డిసెంబ‌ర్ 16న భారీ అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తోన్న గ‌డియ‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో అభిమానుల్లో ఉత్కంఠ‌త అంకంత‌కు పెరిగిపోతుంది. ఆ క్ష‌ణాల కోస ఎంతో ఎగ్టైట్ మెంట్ తో  ఎదురుచూస్తున్నారు.

స‌రిగ్గా ఇదే ఎగ్టైట్ మెంట్ ని 'పుష్ప‌-2' ఎన్ క్యాష్ చేసుకునేలా ఉందా?  పుష్ప‌-2ని సైతం అంత‌ర్జాతీయ భాష‌ల్లో ప్లాన్ చేస్తున్నారా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. ఇప్ప‌టికే పుష్ప‌-2 పై ఎలాంటి అంచ‌నాలు నెల‌కొన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. రెండ‌వ భాగాన్ని అత్యున్న‌త‌ ఉన్న‌త సాంకేతిక ప్ర‌మాణ‌ల‌తో తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దీనిలో భాగంగా షూటింగ్ ద‌శ‌నుంచే ప్ర‌చార ప‌ర్వాన్ని ప‌రుగులు పెట్టించేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం అందుతుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో పుష్ప‌-2కి సంబంధించిన చిన్న వీడియో గ్లింప్స్ ని విడుద‌ల చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. దీనికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌రవేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే బ‌న్నీ పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో బ‌న్నీలేని కొన్ని స‌న్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇక డిసెంబ‌ర్ 16న అవతార్ -2 రిలీజ్ అవుతోన్న సంద‌ర్భంగా అదే రోజున పుష్ప‌- గ్లింప్స్ కూడా రిలీజ్ చేయాల‌ని టీమ్ భావించిన‌ట్లు సమాచారం. ఈ  ప్ర‌చార చిత్రాన్ని అవ‌తార్ -2 త‌ర‌హాలోనే వివిధ అంత‌ర్జాతీయ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారుట‌.

ఇదే వేదిక‌గా సినిమా రిలీజ్ తేదిని కూడా అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తె లిసింది.  ఇదే నిజ‌మైతే పుష్ప‌-2ని ప్రేక్ష‌కులు అనుకున్న దానికంటే అంత‌కు మంచి  భారీ ఎత్తునే ప్లాన్ చేస్తున్న‌ట్లు అంచ‌నా వేయోచ్చు.

ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన పుష్ప పాన్ ఇండియాలో దుమ్ముదులిపేసింది. దీంతో రెండ‌వ భాగంపై అంచ‌నాలు ఆకాశాన్నంట‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో దర్శ‌కుడు సుకుమార్ సినిమా స్పాన్ ని అంత‌కంత‌కు పెంచుకుంటూ వెళ్లారు.  ఈ క్ర‌మంలోనే షూటింగ్ ప్రారంభం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకున్నారు. కంటెంట్ ప‌రంగా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తెచ్చేలా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News