ట‌పాసుల పండుగ త‌ర్వాతే పుష్ప‌-2!

Update: 2022-10-13 11:30 GMT
'పుష్ప‌-2' షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌లవుతుందా? అని అభిమానుల్లో నెల‌కొన్న సంద‌డి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.  సాధార‌ణంగా అభిమానుల్లో రిలీజ్ ఎగ్జైట్ మెంట్ క‌నిపిస్తుంది. కానీ ఇటీవ‌లి కాలంలో ఆ ట్రెండ్ మారింది. ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అన్న‌ ద‌గ్గ‌ర నుంచే అభిమానుల్లో  ఎగ్జైట్ మెంట్ మొద‌ల‌వుతుంది. అందులోనూ హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ అయినా..కొన‌సాగింపు క‌థ‌లైనా ఆ ఎగ్టైట్ మెంట్ ఏకంగా ఊర‌క‌లేస్తుంది.

'కేజీఎఫ్'..'బాహుబ‌లి' ప్రాంచైజీ త‌ర్వాత అంత‌టి బ‌జ్ ని తీసుకొ్చిన ప్రాంచైజీ పుష్ప‌. మొద‌టి భాగం ది రైజ్ భారీ విజ‌యం సాధించ‌డంతో కొన‌సాగింపు క‌థ‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఆ సినిమా ఎప్పుడు మొద‌లవుతుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న ఉత్సాహం అభిమానుల్లో క‌నిపిస్తుంది. మొద‌టి భాగం  స‌క్సెస్ హా అభిమానుల్లో నెల‌కొన్ని బ‌జ్ ని దృష్టిలో పెట్టుకునే రెండ‌వ భాగం స్వ‌రూప‌మే సుకుమార్ మార్చేసే ప‌నిలో ఉన్నారు.

మొద‌టి భాగం హిందీ బెల్ట్ లోనూ పెద్ద స‌క్సెస్ సాధించడంతో హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న‌ట్లు ఆల‌స్యంగా  వెలుగులోకి వ‌చ్చింది. ముందు రాసుకున్న క‌థ‌లో భారీ మార్పులు చేసి టెక్నిక‌ల్ సినిమాని హై స్టాండ‌ర్డ్ లో కి మారుస్తున్న‌ట్లు లీకులంద‌తున్నాయి.  లొకేష‌న్లు..విజువ‌ల్ ఎఫెక్స్ట్... ఇత‌ర‌త్రా సాంకేతిక విష‌యాల్లో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారుట‌.

ఇంత వ‌ర‌కూ  ఏ ఇండియ‌న్ సినిమా ఇవ్వ‌ని డిఫ‌రెంట్  ఎక్స్ పీరియ‌న్స్ ని ఆడియ‌న్స్ కి అందించేలా సుకుమార్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియాని మించి పాన్ వ‌ర‌ల్డ్ ల‌కి రీచ్ అయ్యేలా క‌థ ద‌గ్గ‌ర నుంచి సాంకేతిక అంశాల వ‌ర‌కూ ప్ర‌తీ విష‌యంలోనూ పిన్ టు పిన్ కేర్  తీసుకుంట్లున్నట్లు స‌మాచారం.

బ‌డ్జెట్ కూడా వందల  కోట్లు కేటాయిస్తున్నారుట‌. ఈ క్ర‌మంలోనే ఎక్కువ స‌మ‌యం తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. అయితే ఆ ప‌నులు ఇప్ప‌టికే దాదాపు ముగింపుకు చేరుకున్నాయ‌ని సమాచారం. దీపావ‌ళి పండ‌గ త‌ర్వాత  రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారుట‌.  అలాగే సినిమాలో య‌ధావిధిగా మొద‌టి భాగంలో హీరోయిన్ గా న‌టించిన  ర‌ష్మిక‌ మంద‌న్న  రెండ‌వ భాగంలోనూ కొన‌సాగిస్తున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా  తెలిసింది.

పాత్ర‌ల ప‌రంగా కొత్త పాత్ర‌లు యాడ్ అవుతాయి త‌ప్ప మొద‌టి భాగంలో పాత్రల‌న్నీ అవ‌సరం మేర తెర‌పై క‌నిపిస్తాయ‌ని అంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్  సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News