అల్లు అర్జున్ లక్ ఏంటో కాని.. అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. 2020 సంవత్సరంలో అల వైకుంఠ పురంలో సినిమా తో వచ్చిన బన్నీ ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా థియేటర్ రన్ పూర్తి అయిన వెంటనే కరోనా మొదలైంది. అల వైకుంఠపురం లో సినిమా కాస్త తేడాతో కరోనాను తప్పించుకుంది. కరోనా వల్ల పుష్ప సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. అయితే ఆలస్యం చేయకుండా షూట్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయడం జరిగింది. సెకండ్ వేవ్ తర్వాత స్పీడ్ గా షూట్ ను ముగించి మూడవ వేవ్ కు కాస్త ముందు విడుదల చేయడం జరిగింది. పుష్ప ఇంకా థియేటర్ లో ఉండగానే మూడవ వేవ్ ముచ్చట్లు మొదలు అయ్యాయి. ఉత్తరాదిన థియేటర్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా ఇప్పటికే 300 కోట్ల ను దక్కించుకున్నాడు కనుక పుష్పకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు పుష్ప గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అదేంటీ అంటే... పుష్ప సినిమా 2021 లో విడుదల అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కేవలం తెలుగు లోనో లేదా సౌత్ లోనో కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల అయిన సినిమాల్లో పుష్ప నెం.1 గా నిలిచిందట. మొన్నటి వరకు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా నెం.1 గా నిలిచింది. ఇటీవలే 300 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుని ఇప్పుడు సూర్యవంశీనే పుష్ప రాజ్ కొట్టేశాడు. ముగ్గురు స్టార్ హీరోలు నటించిన బాలీవుడ్ సినిమా ను చాలా ఈజీగా మన తెలుగు సినిమా కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఉత్తరాదిన ఏమాత్రం పబ్లిసిటీ చేయకుండానే 50 కోట్ల వసూళ్లను పుష్ప దక్కించుకున్నాడు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ.. తమిళనాడు.. బెంగళూరు ఇలా అన్ని చోట్ల కూడా భారీగా వసూళ్లు నమోదు చేసిన పుష్ప విడుదల అయిన రెండు వారాల తర్వాత కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను దక్కించుకుంటుంది. తాజాగా కొత్త సంవత్సరం కానుకగా జనాలు పుష్ప నే ఎక్కువ చూశారు. 2021 లో దేశ వ్యాప్తంగా కరోనా వల్ల కాస్త తక్కువ సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మన పుష్ప రాజ్ నెం.1 గా నిలిచాడు. సినిమా కు మిశ్రమ స్పందన వచ్చింది. వంద కోట్లు ఈ సినిమా రాబడితే చాలా గొప్ప విషయం అనుకున్నారు. ఉత్తరాదిన ఈ సినిమా మొదటి రోజు కనీసం 25 శాతం ఆక్యుపెన్సీ కూడా నమోదు అవ్వలేదు అంటూ ట్రోల్స్ నమోదు అయ్యాయి. కాని పుష్ప సినిమా మాత్రం అవన్నీ పక్కకు నెట్టి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించి అక్కడ 50 కోట్లు మొత్తంగా 300 కోట్లకు పైగా రాబట్టి ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది.
సంక్రాంతి వరకు ఇదే జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక నిజం అయితే మరో 50 కోట్ల వరకు సినిమా రాబట్టి మొత్తంగా 350 కోట్ల తో ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేయడం.. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందేమో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ పుష్ప సినిమా చిత్రీకరణ సమయం నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో కీలక పాత్రల్లో సునీల్.. ఫాహద్ ఫాజిల్.. అనసూయ కనిపించారు. సెకండ్ పార్ట్ ను ఫిబ్రవరి లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.