అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ చేయబోతున్న ‘పుష్ప’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహమ్మారి వైరస్ వచ్చి ఉండకుంటే ఇప్పటి వరకు చాలా షూటింగ్ పూర్తి అయ్యేది. కేరళలో ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ ను ప్లాన్ చేశారు. కేరళ షెడ్యూల్ కు మరికొన్ని రోజుల్లో వెళ్లాల్సి ఉండగా షూటింగ్స్ అన్ని నిలిచి పోయాయి. దాదాపు మూడు నెలల తర్వాత షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో మెల్లగా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి.
పుష్ప చిత్రంను కూడా మొదలు పెట్టేందుకు దర్శకుడు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కథానుసారం ఎక్కువగా శేషాచలం అడవుల్లో సీన్స్ ఉంటాయి. కనుక అడవిలోనే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయట ప్రాంతాల్లో షూటింగ్స్ చేయడం సాధ్యం కాదు. కనుక దాదాపు అన్ని సినిమాలు కూడా హైదరాబాద్ స్టూడియోలు మరియు పరిసర ప్రాంతాల్లో చేయాలని భావిస్తున్నారు.
పుష్ప చిత్రం కోసం హైదరాబాద్ లోనే సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో అడవి సెట్టింగ్ ను వేయించబోతున్నాడట. భారీ ఖర్చుతో శేషాచలం అడవులను తలపించేలా సెట్ ను నిర్మించబోతున్నారట. షూటింగ్ ఎక్కువ శాతం ఆ సెట్ లోనే చేయబోతున్నారట. పుష్ప చిత్రం ఎక్కువ శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి ఆ తర్వాత కొంత భాగంను ఏపీలో షూట్ చేయనున్నట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. హీరోయిన్ గా రష్మిక మందన్న నటించబోతుంది. అల్లు అర్జున్ మరియు రష్మిక మందనలు ఇప్పటికే ఈ సినిమాలోని పాత్రల కోసం చిత్తూరు యాసను నేర్చుకోవడం జరిగింది. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. కనుక ఇతర భాషల్లో సొంతంగా బన్నీ డబ్బింగ్ చెప్పేందుకు ఆ భాషలపై పట్టు సాధిస్తున్నాడట.