ర‌ష్యాలో 'పుష్ప‌'...ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో పుష్ప‌రాజ్!

Update: 2022-11-26 11:30 GMT
పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' ర‌ష్యా వేట‌కి సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ లో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఓవైపు పుష్ప  రెండ‌వ భాగం  షూటింగ్  ప‌నుల్లో నిమ‌గ్న‌మైనా..సుకుమార్ మాత్రం ర‌ష్యా రిలీజ్ ప‌నుల్ని అశ్ర‌ద్ద‌ చేయ‌లేదు. రెండు ప‌నులు ఏక కాలంలో చక్క‌బెడుతున్నారు. అయితే ఈ విష‌యంలో  బ‌న్నీసైతం త‌గ్గేదేలే అంటున్నాడు.

సుకుమార్ లాగే తాను రిలీజ్ పనుల‌పై త‌న స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా  బ‌న్నీసైతం ర‌ష్యా వెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడు. పుష్ప ర‌ష్యా  రిలీజ నేప‌థ్యంలో  ఈ చిత్రాన్ని అక్క‌డి ఆడియ‌న్స్ మ‌ద్య‌లో థియేట‌ర్ లో కూర్చుని చూడాల‌ని నిర్ణ‌యించారుట‌.  సినిమా చూస్తూ రష్యా ప్రేక్ష‌కులు ఎలా రియాక్ట్ అవుతారు?  అన్న అనుభూతిని ఆస్వాదించ‌డం కోస‌మే బ‌న్నీ అక్క‌డిక వెళ్ల‌డానికి నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రి బ‌న్నీ ఎలాంటి అనుభూతి పొందుతాడు అన్న‌ది మ‌రికొద్ది రోజుల్లోనే  తెలిసిపోతుంది. అయితే ర‌ష్యా రిలీజ్ వెనుక సుకుమార్ స్ర్టాట‌జీ ఏంట‌న్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. సాధార‌ణంగా తెలుగు సినిమాలు జ‌పాన్...చైనా..థాయ్ లాండ్ దేశాల్లో ఎక్కువ‌గా రిలీజ్ అవుతుంటాయి. రాజ‌మౌళి తెర‌కెక్కించిన  బాహుబ‌లి..ఆర్ ఆర్ ఆర్ సినిమాలు అక్క‌డే రిలీజ్ అయ్యాయి.

అలాగే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమ‌లు  ఆయాదేశాల్లోనే రిలీజ్ అయ్యాయి. కానీ సుకుమార్ అక్క‌డ కాకుండా పుష్ప  కోసం ర‌ష్యాని ఎంపిక చేసుకోవ‌డం వెనుక ఏదో పెద్ద క‌థే ఉంద‌ని గెస్సింగ్ తెర‌పైకి వ‌స్తున్నాయి.  ఇలాంటి క‌థ‌ల‌కు...ర‌ష్యా రిలీజ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్న‌ట్లే తెలుస్తోంది.  అక్క‌డి ప్రేక్ష‌కులు ఇలాంటి క‌థ‌ల్ని ఆద‌రిస్తారు అన్న సానుకూల దృక్ఫ‌థంతోనే ర‌ష్యాకి వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.  మ‌రి ర‌ష్యాలో బ‌న్నీ ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తాడో చూడాలి.

మ‌రి రిలీజ్ కి ముందు అక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అన్న దానిపై టీమ్ ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. వీలైనంత వ‌ర‌కూ అక్క‌డా నాలుగైదు రోజుల పాటు ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. జ‌పాన్ లో 'ఆర్ ఆర్ ఆర్' ని అలాగే ప్ర‌మోట్ చేసారు. అయితే దీని ప్ర‌మోష‌న్ వెనుక ఆస్కార్ స్ర్టాట‌జీ ఉంద‌ని గుస‌గుస  వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News