'పుష్ప' సాంగ్ షూటింగ్ వీడియో లీక్..!

Update: 2021-02-02 19:06 GMT
సుకుమార్ - అల్లు అర్జున్ - దేవీ శ్రీ ప్రసాద్ త్రయం కలయికతో హ్యాట్రిక్ మూవీ 'పుష్ప' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడిగా పేరున్న దేవిశ్రీ దానికి తగ్గితే మ్యూజిక్ అందిస్తూ ఉంటాడు. గతంలో వీరి కలయికలో వచ్చిన సినిమాల ఫలితం ఎలా ఉన్నా సంగీతం పరంగా ఎప్పుడు డిజప్పాయింట్ చేయలేదు. ఇప్పుడు 'పుష్ప' సినిమాకి కూడా రాక్ స్టార్ అదే రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నాడని తెలుస్తోంది. 'పుష్ప' చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా 'పుష్ప' లోని ఓ సాంగ్ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది.

ఈ వీడియో ద్వారా 'పుష్ప' యూనిట్ మొత్తం ఓ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. గంధపు చెక్కల స్మగర్లందరూ అడవిలో పార్టీ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు బయటకు వచ్చిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. మ్యూజిక్ ప్లే అవుతుండగా.. అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండు మూడు సార్లు రీటేక్‌ లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లిరిక్స్ వినిపించనప్పటికీ బీట్ మాత్రం బయటకు వచ్చింది. దీనికి బన్నీతో పాటు సైడ్ డ్యాన్సర్స్ కూడా కాలు కదుపుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఈ బీట్ సూపర్ గా ఉందని కామెంట్స్ చేస్తుంటే.. యాంటీ ఫ్యాన్స్ మాత్రం అది 'సర్దార్ గబ్బర్ సింగ్' టైటిల్ బీట్ అని అప్పుడే ట్రోల్ చేయడం స్టార్ట్ చేసేశారు.
Tags:    

Similar News