సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ప్రతీ ఏడాది ఔత్ ఇండియాకు చెందిన నాలుగు భాషల ఇండస్ట్రీలలో రూపొందిన సినిమాలకు, నటులుకు, సాంకేతిక నిపుఫులతో ప్రత్యేకంగా అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అదే ప్రకారం ఈ ఏడాది పదవ ఎడిషన్ తో రాబోతోంది. దక్షిణ భారతంలో అత్యంత పాపులర్ పొందిన అవార్డ్ ఫంక్షన్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. నాలుగు భాషలకు చెందిన టాప్ స్టార్స్ తో పాటు పలువురు టాప్ టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ కి చెందిన వారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతీ ఏడాది భారీ స్థాయిలో పాల్గొంటూ వస్తున్నారు.
వివిధ శాఖల్లో పలు అవార్డుల్ని సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) కూడా దక్షిణ భారత చలన చిత్ర వర్గాల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ 10, 11 లేదీలతో కర్ణాటకలోని బెంగళూరులో వైభవంగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా 2021 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) చైర్మన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి నాలుగు దక్షిణ భారత భాషల్లో విడుదలైన సినిమాలకు సంబంధించిన SIIMA నామినేషన్స్ ని ప్రకటించారు.
ఈ నామినేషన్స్ లో తెలుగు నుంచి అల్లు అర్జున్ నటించిన'పుష్ప', తమిళం నుంచి ధనుష్ నటించిన'కర్ణన్', కన్నడం నుంచి దర్శన్ నటించిన'రాబర్ట్', మలయాళం నుంచి టివినో థామస్ నటించిన'మిన్నాల్ మురళి' పలు కేటగిరీల్లో ఆయా భాషల నుంచి ముందు వరుసలో వున్నాయి. తెలుగు సినిమాలో అల్లు అర్జున్ నటించిన'పుష్ప' వివిధ కేటగిరిలకు సంబంధించి 12 నామినేషన్లతో టాప్ లో నిలవగా, బాలకృష్ణ నటించిన'అఖండ' 10 నామినేషన్ లలో తరువాత స్థానంలో నలిచింది. ఉప్పెన, జాతిరత్నాలు ఒక్కో సినిమా 8 నామినేషన్ లలో మూడవ స్థానంలో నిలిచాయి.
ఇక తమిళం నుంచి తీసుకుంటే ధనుష్ నటించిన'కర్ణన్' 10 నామినేషన్ లతో మొదటి స్థానంలో నిలవగా, శివకార్తికేయన్ నటించిన'డాక్టర్' మూవీ 9 నామినేషన్ లలో రెండవ స్థానంలో నిలిచింది. విజయ్ నటించిన మాస్టర్, కంగన నటించిన'తలైవి' ఒక్కో సినిమా 7 నామినేషన్ లతో మూడవ స్థానం దక్కించుకున్నాయి. ఇక కన్నడ నుంచి దర్శన్ హీరోగా తరుణ్ సుధీర్ డైరెక్ట్ చేసిన'రాబర్ట్' 10 విభాగాల్లో నామినేషన్స్ తో అగ్ర స్థానంలో నిలిచింది. ఇక రాజ్ బి. శెట్టి డైరెక్ట్ చేసి రిషబ్ శెట్టితో కలిసి నటించిన'గరుడగమన వృషభ వాహన' 8 నామినేషన్ లతో రెండవ స్థానంలో నిలవగా, పునీత్ రాజ్ కుమార్ నటించిన'యువరత్న' 7 నామినేషన్ లలో మూడవ స్థానంలో నిలిచింది.
ఇక మలయాళం నుంచి టివినో థామస్ నటించిన'మిన్నాల్ మురళి' 10 నామినేషన్ లతో ప్రధమ స్థానంలో నిలిచింది. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ రూపొందించిన'కురుప్' 8 నామినేషన్ లతో రెండవ స్థానంలో నిలవగా, ఫహద్ ఫాజిల్ నటించిన'మాలిక్', దిలీష్ పోతన్ డైరెక్ట్ చేసిన'జోజీ' సినిమాలు ఒక్కోక్కటి 6 నామినేషన్ లతో మూడవ స్థానంలో నిలిచాయి.