చూసిన ప్రతి ఒక్కరి చేత ప్రశంసించబడుతున్న మహానటి ప్రభంజనం కొనసాగుతోంది. ఓపెనింగ్స్ పరంగా పెద్ద రికార్డులు ఏమి సృష్టించనప్పటికీ మౌత్ పబ్లిసిటీతో పాటు రివ్యూలన్ని పూర్తి పాజిటివ్ గా రావడంతో వీక్ ఎండ్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసేసుకుంది. ఓవర్సీస్ లో స్టార్ హీరోలకు ధీటుగా వసూళ్లు రావోచ్చనే అంచనాలు ఉన్నాయి.మహానటి ఎంత గొప్పగా వచ్చినా అందులో మిస్ అయిన కొన్ని పాత్రల గురించి చర్చ జరుగుతూనే ఉంది. జెమినీ గణేషన్ కు సావిత్రి గారితో కలిపి ఇద్దరు భార్యలు ఉన్నట్టు ఇందులో చూపించారు. నిజానికి ఆయనకు పుష్పవల్లి అనే మరో భార్య కూడా ఉంది. ఆమె ద్వారా కలిగిన సంతానమే నిన్నటి తరం టాప్ బాలీవుడ్ హీరొయిన్ రేఖ. ఆ పాత్ర పూర్తిగా ఇందులో మిస్ కావడంతో సావిత్రి కథ మీద అవగాహన లేని వాళ్ళు జెమినీ గణేషన్ కు ఉన్నది ఇద్దరు భార్యలే అనుకున్నారు.
కాని వాస్తవంగా దర్శకుడు నాగ అశ్విన్ ఆవిడ పాత్రను కూడా షూట్ చేసాడట. బిందు చంద్రమౌళి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద తనకు సంబంధించిన సీన్లు రెండు చిన్న పాటల్లో బిట్స్ తీసాడట. కాని అప్పటికే లెంగ్త్ నాలుగు గంటల దరిదాపుల్లోకి వెళ్ళడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిట్ చేయక తప్పలేదని తెలిసింది. ఫైనల్ కాపీలో తన పాత్ర పూర్తిగా లేదని తెలిసి బిందు నిరాశ చెందినట్టు తెలిసింది. ఇంత ఎమోషన్ ఉన్న సావిత్రి గారి కథను మూడు గంటల్లో చెప్పడం అంటే క్లిష్టమైన పని. అందులోనూ స్వయానా సావిత్రి గారి స్వంత అక్కయ్య పాత్రను కూడా నాగ అశ్విన్ ఈ కారణంగానే పొందుపరచలేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇంతే డెప్త్ ఉన్నప్పుడు రెండు భాగాలుగా తీసుంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది కాని బాహుబలి తరహాలో ఇది ఫాంటసీ మూవీ కాదు కాబట్టి వర్క్ అవుట్ చేసుకోవడం అంత సులభం కాదు. ఈ లెక్కలన్నీ చూసుకునే అశ్విన్ కత్తెరకు పని చెప్పినట్టు ఉంది. పోనీ అలా మిస్ అయితే అయ్యాం కాని తర్వాత యు ట్యూబ్ లో అయినా ఆ ఫుటేజ్ ని విడుదల చేయమని కోరుతున్నారు అభిమానులు. అదీ జరిగితే మంచిదే. సావిత్రి గారి జీవితంలో కొత్త కోణాలు చూడొచ్చు.