మహేష్ తో పివిపి డీల్!

Update: 2016-02-21 06:48 GMT
మహేష్ బాబు తాజా సినిమా ‘బ్రహ్మోత్సవం' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాత పి.వి.పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు కూడా ‘శ్రీమంతుడు' తరహాలోనే సహనిర్మాతగా ఉండాలని మహేష్ బాబు భావించారు. అయితే మహేష్ బాబు భాగస్వామ్యం ఇష్టం లేని నిర్మాత పివిపి మహేష్ బాబుతో చర్చలు జరిపారట. సినిమాను పూర్థి స్థాయిలో తానే నిర్మిస్తానని చెప్పారట. ఈ మేరకు మహేష్ బాబుకు 25 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడని, దీంతో పాటు లాభాల్లో కొంత వాటా ఇస్తానని డీల్ సెట్ చేసారట.

విడుదలకు ముందే ‘బ్రహ్మోత్సవం' బిజినెస్ ఓ రేంజిలో సాగుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీగా 13 కోట్లకు అమ్ముడిపోయాయి. శాటిలైట్ రైట్స్ కూడా 12 కోట్లకుపైనే పలుకుతుందని సమాచారం. శాటిలైట్, ఓవర్సీస్ రూపంలోనే సినిమాకు 25 కోట్ల బిజినెస్ అయింది. థియేట్రికల్ రైట్స్, ఇతర రైట్స్ రూపంలో మరో 90 కోట్ల బిజినెస్ జరుగడం ఖాయం అంటున్నారు.
Tags:    

Similar News