పీవీపీ వాళ్లను అందుకు అభినందించాలి

Update: 2016-03-22 08:06 GMT
బాలీవుడ్ సినిమాల్ని ఫ్రీమేక్ చేసేసి... వాళ్లకు డబ్బులు కానీ, క్రెడిట్ కానీ ఇవ్వని ప్రబుద్ధులున్నారు మన దగ్గర. ఇక ఫారిన్ సినిమాల విషయంలో మనోళ్ల తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా మొత్తం డిట్టో దించేసి.. అది తమ క్రియేటివిటీనే అని చెప్పుకునే వాళ్లకు లెక్కేలేదు. ఐతే ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం కుగ్రామంగా మారిపోవడం.. మన సినిమాలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్తుండటంతో ఈ మధ్య మన ఫిలిం మేకర్స్ లో మార్పు వస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు.. విదేశీ సినిమాల నుంచి స్ఫూర్తి పొందితే అఫీషియల్ గా రీమేక్ రైట్స్ తీసుకుని సినిమాలు తీసుకుంటున్నారు. కొందరు ఆ విషయం బయటికి చెబుతున్నారు.. కొందరు చెప్పట్లేదు. ఐతే రైట్స్ మాత్రం తీసుకుంటున్నారు.

ఐతే సౌత్ ఇండియాలో మాత్రం ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత పీవీపీ సంస్థదే. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’ స్ఫూర్తితో సినిమా తీద్దామనుకున్నాక.. ఆ చిత్ర నిర్మాతల్ని సంప్రదించి రీమేక్ రైట్స్ తీసుకున్నారు. మరో సంస్థ అయితే.. ఏమవుతుందిలే అని ఫ్రీమేక్ చేయడానికి రెడీ అయిపోయేది. ఐతే పీవీపీ ఓ ఇంటర్నేషనల్ బిజినెస్ మేన్. ఆయన సంస్థలో ఓ ఫ్రీమేక్ తయారై.. అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా చర్చకు వెళ్లిందంటే ఆయన సంస్థ గుడ్ విల్ దెబ్బ తింటుంది. నిర్మాణ విలువల విషయంలో ఏమాత్రం రాజీ పడని ఆయన.. ఈ రీమేక్ విషయంలోనూ విలువలు పాటించారు. రైట్స్ తీసుకోవడమే కాక.. ఇది అఫీషియల్ రీమేక్ అని కూడా ప్రకటించారు. మరి తెలుగులో వస్తున్న తొలి అఫీషియల్ ఫారిన్ రీమేక్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News