కోహ్లీ.. అనుష్కను వదిలేయ్

Update: 2016-04-04 10:15 GMT
పాకిస్థాన్ మోడల్ కందీల్ బలోచ్ కు భారతీయుల మీద ప్రేమ అంతకంతకూ పెరిగిపోతోంది. మొన్న టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇండియాను పాకిస్థాన్ ఓడిస్తే.. బట్టలిప్పి డ్యాన్స్ చేస్తా అంటూ బంపరాఫర్ ఇచ్చిన ఈ భామ.. తమ జట్టు ఓడిపోయినప్పటికీ భారత అభిమానుల కోసం ఓ ఎరోటిక్ డ్యాన్స్ చేసి అలరించింది. ఆ వీడియోకు మంచి ఆదరణ వచ్చేసరికి.. ఈ ఊపులో తన పాపులారిటీ మరింత పెంచుకోవడానికి కొత్త ఎత్తు వేసిందామె. ప్రపంచకప లో మెరుపులు మెరిపించి..తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకున్న విరాట్ కోహ్లి మీద ఆమె కళ్లు పడ్డాయి.

విరాట్ కోహ్లి ఇక తన ప్రేయసి అనుష్క శర్మ గురించి ఆలోచించడం మానేయాలని.. అతడి కోసం తానున్నాని ఈ వీడియో ద్వారా ఆఫర్ ఇచ్చింది కందీల్. ‘‘విరాట్ చాలా గొప్ప అందగాడు. కోల్ కతాలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా విరాట్ ఆట నాకు పిచ్చెక్కించింది. సీరియస్ గా చెబుతున్నా. విరాట్ అనుష్కను వదిలేయాలి. నా గురించి ఆలోచించాలి. నేను అతడితో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. విరాట్.. ఐ లవ్ యూ బేబీ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. అనుష్కను వదిలేయ్. ఆమెను వదలేయ్’’ అంటూ వీడియో సందేశం పంపించింది కందీల్. ఐతే కందీల్ కు తెలియని విషయం ఏంటంటే.. విరాట్ ఆల్రెడీ అనుష్కకు దూరమయ్యాడు. సింగిల్ గానే ఉన్నాడు. కాబట్టి మరి అతడు కందీల్ కు పడతాడేమో చూడాలి.
Full View

Tags:    

Similar News