తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత జయలలిత జీవితం ఆధారంగా పలు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఎఎల్ విజయ్ - కంగనా రనౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'తలైవి' సినిమా టీజర్ విడుదలైంది. తాజాగా జయలలిత జీవితం పై తెరకెక్కుతున్న మరో బయోపిక్ 'క్వీన్' టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెబ్ సీరీస్ రూపంలో రానున్న ఈ బయోపిక్ లో జయలలిత చిన్నప్పటి ఎపిసోడ్లకు ప్రసత్ మురుగన్ దర్శకత్వం వహిసున్నారు. జయలలిత యుక్తవయసు.. పెద్దవయసు ఎపిసోడ్లకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ బయోపిక్ సీరీస్ ను ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ చేస్తారు. 'క్వీన్' సీరీస్ టీజర్ ను కూడా ఎంఎక్స్ ప్లేయర్ వారి సోషల్ మీడియా ఖాతాద్వారా షేర్ చేశారు. 26 సెకన్ల టీజర్ లో జయ చిన్ననాటి సంఘటనలను మాంటేజ్ షాట్స్ తరహాలో చూపించారు. ఎక్కడా మొహం చూపించకుండా డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ సీన్లు ఉండడం గమనార్హం. టీజర్ మొదటి షాట్ లో స్కూల్ యూనిఫాం లో మైక్ ముందు నిలుచుని ఉంటే విద్యార్థులందరూ జయకు చప్పట్లతో తమ జేజేలు తెలుపుతూ ఉంటారు. మరో సీన్ లో అద్భుతంగా జయ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. '18 ఏళ్ళకు సూపర్ స్టార్ హీరోయిన్ గా జయ' అంటూ ఒక స్లైడ్ వేసి మరీ చూపించారు. చివరిగా జయ పాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ ఎంట్రీ. అన్నా డీఎంకే నాయకురాలిగా పార్టీ కలర్లు బోర్డర్ గా ఉన్న చీర ధరించి ప్రజలను కలుస్తూ.. మాట్లాడుతూ.. వారి సమస్యలు వింటూ.. అభివాదం చేస్తూ కనిపిస్తారు.
ఈ సీరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను డిసెంబర్ 5 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. వివాదాస్పదం కాకుండా ఉంటుందా అనేది తెలియాలంటే వేచి చూడాలి. అప్పటిలోపు ఈ టీజర్ ను ఒక సూపు సూడండప్పా!
Full View