హృతిక్ రోషన్-కంగనా రనౌత్ మధ్య వివాదం ఒక పట్టాన తేలే లాగా కనిపించడం లేదు. ఈ గొడవ వల్ల ఇద్దరికీ ఏ రకంగానూ మేలు జరిగే అవకాశం లేకపోవడంతో త్వరలోనే ఇద్దరూ రాజీకి వస్తారని భావించారు. ఐతే హృతిక్ కానీ.. కంగనా కానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. మొన్న హృతిక్ రోషన్.. కంగనా తనకు 3 వేల మెయిల్స్ పంపించిందని.. అందులో ఓ న్యూడ్ ఫొటో కూడా ఉందని చెప్పడంతో కంగనా డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పుడు కంగనా కూడా ఎదురుదాడికి దిగింది. తన లాయర్ ద్వారా హృతిక్ కు ఆమె చాలా ప్రశ్నలు సంధించింది.
తన పేరుతో కంగనాకు ఓ నకిలీ వ్యక్తి కంగనకు ఈమెయిల్స్ పంపించినట్లు చెబుతున్న హృతిక్.. ఆ సంగతి తెలిసినా ఎందుకు రెస్పాండవలేదు.. నకిలీ అకౌంటుతో ఈమెయిల్స్ పంపిన వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టలేదు..? ఈమెయిల్స్ గురించి కంగనా చెప్పిన ఏడు నెలల తర్వాత ఎందుకు ఆలస్యంగా కేసు పెట్టాడు..? ఈమెయిల్స్ విషయంలో పోలీసులకు.. మీడియాకు హృతిక్ ఎందుకు అబద్ధం చెప్పాడు..?
పేరిట నకిలీ ఖాతా ఉందనే విషయం అభిమానుల ద్వారా, బాలీవుడ్ లోని వ్యక్తుల ద్వారా తెలిసిందని మాత్రమే అతను చెప్పాడు. నిజానికి కంగన తన సోదరి ద్వారా ఈ విషయాన్ని ఆయనకు చెప్పిన సంగతి ఎందుకు చెప్పలేదు..? కంగనా పేరుతో వచ్చిన మెయిల్స్ అన్నీ ఆమే పంపిందని ఎలా చెప్పగలరు..? ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నివేదిక అవసరం లేదని అతను ఎందుకు వాదిస్తున్నాడు..? పోలీసులకు ఎందుకు సహకరించడంలేదు...? అంటూ ప్రశ్నలు సంధించాడు కంగనా లాయర్. మరి ఈ ప్రశ్నలపై హృతిక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.