రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఒక తపస్సులా .. యజ్ఞంలా ఈ సినిమా షూటింగు జరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా కోసం అన్నివర్గాల ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరి హీరోల కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇదే. చరిత్ర నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిన కథ కావడం, విప్లవ వీరుల పాత్రలను ఎన్టీఆర్ - చరణ్ పోషిస్తుండటం ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలను పెంచుతూ వెళుతోంది.
రాజమౌళి అనే పేరు అపజయానికి విరుగుడుగా మారిపోయింది. అపజయమనేది ఆయన దరిదాపుల్లోకి రావడానికి భయపడుతోంది. విజయమనేది ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. రాజమౌళి కెరియర్ ను పరిశీలిస్తే, ఆయన సినిమాలు ఒకదానిని మించిన విజయం మరొకటి సాధిస్తూ వస్తున్నాయి. తెలుగు సినిమాను ప్రపంచపటానికి పరిచయం చేసేంతవరకూ ఆయన విశ్రమించలేదు. ఎదురులేని విజయమంటే ఇది .. తిరుగులేని వసూళ్లంటే ఇవి అని ఆయన నిరూపించాడు. తెలుగు సినిమాను ప్రపంచ సినీ శిఖరాన నిలబెట్టాడు.
ఇంతవరకూ రాజమౌళి చేస్తూ వచ్చిన సినిమాల్లో ఎక్కువగా రిపీట్ చేసిన హీరో ఎన్టీఆర్. రాజమౌళి తొలి సినిమానే ఎన్టీఆర్ తో మొదలైంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'స్టూడెంట్ నెంబర్ వన్' ... 'సింహాద్రి' .. 'యమదొంగ' సినిమాలు బాక్సాఫీస్ తో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నాయి. ఇక చరణ్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' .. విజయం విజృంభిస్తే ఎలా ఉంటుందనేది చాటిచెప్పింది.
అలా ఈ ఇద్దరి హీరోలతో తిరుగులేని విజయాలను అందుకున్న రాజమౌళి, ఈ ఇద్దరినీ కలిపి 'ఆర్ ఆర్ ఆర్' రూపొందిస్తుండటమే అంతకంతకూ అంచనాలు పెంచుతున్నాయి. ఈ ముగ్గురూ కలిసి సృష్టించనున్న సంచలనాన్ని తట్టుకుని నిలబడటానికిగాను, అన్ని భాషల్లోని బాక్సాఫీసులు వర్కౌట్లు చేస్తున్నాయి. ఈ సంచలనానికి సాక్ష్యంగా నిలవడానికిగాను తామంతా రెడీగానే ఉన్నామంటూ, ఆడియన్స్ సంకేతాలు ఇస్తున్నారు. ఇక 'ఆర్ ఆర్ ఆర్' అఖండ విజయం నుంచి తప్పించుకోవడం కష్టమేనేమో!