పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రాయ్ లక్ష్మి 

Update: 2023-01-18 15:30 GMT
కొంతమంది భామలకి అందం, అభినయం ఉన్న కూడా అదృష్టం మాత్రం వరించదు. దీంతో అడపాదడపా అవకాశాలు వచ్చినా కూడా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోతారు. అలాంటి వారిలో అందాల భామ రాయ్ లక్ష్మి కూడా ఉంటుందని చెప్పాలి. ఈ అమ్మడు నటిగా కెరియర్ ప్రారంభించి 18 సంవత్సరాలు దగ్గర అవుతుంది.

ఇన్నేళ్ల సుదీర్ఘ కెరియర్ ఆమె 59 చిత్రాలలో నటించింది. సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా ఈమె నటిగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసింది. అయితే ఇన్ని సినిమాలు చేసిన కూడా ఆమె స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.

గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును మాత్రం క్రియేట్ చేసుకుంది. ఆమె కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలంటే లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పటికి కూడా నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది.

ఇక ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా బోల్డ్ బ్యూటీగా కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ అమ్మడుకి ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

తాజా బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పింక్ కలర్ స్కర్ట్ తో ఎద అందాలు కనిపించే విధంగా హాట్ లుక్స్ తో రాయ్ లక్ష్మి మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ ఫోటోకి ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉండడం విశేషం.

చివరికి ప్రతిదీ కనెక్ట్ అవుతుంది అంటూ కొటేషన్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కొటేషన్ ఆమె దేనిని ఉద్దేశించి చేసింది అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News