టాలీవుడ్ లో అందరిలా కాకుండా పూర్తి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తోన్న హీరో నారా రోహిత్. సక్సెస్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా కథ డిఫరెంట్ గా ఉంటె చాలు తనదైన శైలిలో సినిమాలను తీస్తూ తనకంటూ.. ఓ స్థాయిని తెచ్చుకున్నాడు ఈ నారా వారి అబ్బాయి. అయితే ప్రస్తుతం "బాలకృష్ణుడు" అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ హీరో రీసెంట్ గా ఓ హీరోయిన్ ను తన సినిమాలో ఓ పాట పాడమని అడిగారట.
ఆమె ఎవరో కాదు టాలీవుడ్ లో బబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా. ఆమె హస్కి వాయిస్ తో సినిమాలో ఓ పాట పాడించడానికి రెడీ అయ్యారట బాలకృష్ణుడు చిత్ర యూనిట్. దీంతో ఆమె కూడా ఒకే అనేసింది. నిన్ననే ఆ పాటను కూడా పాడేసింది. ఆమె ప్రస్తుతం రవితేజ - టచ్ చేసి చూడు మరియు ఎన్టీఆర్- లవ కుశ సినిమాతో బిజీగా ఉండాగా.. ఇలా పాటలతో కూడా ఆకట్టుకుంటోంది. అయితే ఈ బాబ్లీ గర్ల్ కి సింగ్ చేయడం కొత్తేమి కాదు. ఇంతకుముందు "జోరు" అనే సినిమాకి తన గాత్రాన్ని అందచేసింది. మళ్లీ ఇప్పుడు మరో సారి రోహిత్ సినిమా కోసం పాడటానికి రెడీ అయ్యింది.
ఇక నారా రోహిత్ బాలకృష్ణుడు సినిమా కోసం చాలా కస్టపడుతున్నాడు. సినిమాలో సిక్స్ ప్యాక్ లో అలరించనున్నాడు. ఈ సినిమాను పవన్ మల్లెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. చాలా రోజులుగా నారా రోహిత్ సరైన బాక్స్ ఆఫీస్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతో ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ హీరో.