ముద్దుగుమ్మ రాశిఖన్నా తెలుగులో చాలా మంచి భవిష్యత్తును ఊహించుకుంది. ఇక్కడ ఆ అమ్మడికి వచ్చిన ఆఫర్లు చూస్తే భవిష్యత్తులో మంచి హీరోయిన్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కాని ఆమె ఆశించిన స్థాయిలో కెరీర్ ముందుకు సాగలేదు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ అమ్మడి జోరు కొనసాగడం లేదు. ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చడంతో ఇక లాభం లేదనుకుని పూర్తిగా తమిళంకే పరిమితం అవ్వాలనుకుంటుంది.
తెలుగులో ప్రస్తుతానికి ఏ సినిమాలో కూడా నటించడం లేదట. ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నా కూడా అందులో చివరికి ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. అందుకే తమిళంలో వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను వదిలేయకుండా చేసుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంది. తాజాగా ఈమెకు తమిళంలో అర్మణి మూడవ పార్ట్ లో నటించే ఛాన్స్ వచ్చింది. హీరోయిన్ గా అవకాశాు తమిళంలోనే ఎక్కువ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడకు ఈ అమ్మడు షిప్ట్ అవుతుందేమో అంటున్నారు.
ఇక సుందర్ సి దర్శకత్వంలో గతంలో వచ్చిన ఆర్మణి రెండు పార్ట్ లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఆ సిరీస్ లోనే మూడవ పార్ట్ ను తెరకెక్కించేందుకు సిద్దం అయిన దర్శకుడు ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా ఎంపిక అవ్వడం జరిగింది. మొత్తానికి తెలుగులో ఆఫర్లు లేకున్నా కూడా తమిళంలో మాత్రం ఈ అమ్మడు ఆఫర్లతో దూసుకు పోతుంది. అక్కడ నిరూపించుకుని మళ్లీ తెలుగులోకి వస్తుందేమో చూడాలి.