దివ్వెల‌ కాంతుల‌న్నీ రాశీ అందంలోనే!

Update: 2021-11-05 11:30 GMT
ప్ర‌తియేటా స్టార్ల ఇంట దీపావ‌ళి సంబ‌రాల‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గానే షేర్ అవుతుంటాయి. ఈసారి కూడా క‌న్నుల పండుగ‌నే త‌ల‌పిస్తున్న కొన్ని సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు జోరుగానే షేర్ అవుతున్నాయి. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా హీరోయిన్లు అంతా ప్ర‌త్యేకంగా ముస్తాబై ఇన్ స్టా లోకి ఎక్కేసారు. దివాళీ వేళ‌ త‌మ‌దైన శైలి ప్ర‌చారార్భాటంతో ఆక‌ట్టుకుంటున్నారు. చాలామంది నాయికలు సాంప్ర‌దాయ వ‌స్త్రాల్లో త‌ళుక్కున మెరిసారు. త‌రుచూ డిజైన‌ర్‌ దుస్తుల్లో క‌నిపించే భామ‌లు ఒక్క‌సారిగా చీర క‌ట్టులో..ప‌రికిణిల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఈ కొత్త లుక్ చూశాక‌.. ఇంత‌కీ ఎవ‌రీ హీరోయిన్ అంటూ పోల్చుకోవాల్సి వ‌స్తోంది. తాజాగా ఢిల్లీ బ్యూటీ రాశీఖ‌న్నా ఎరుపు రంగు లెహెంగాను ధ‌రించి మైమ‌రిపించారు. అంద‌మంతా రాశీ కాన్ఫిడెన్స్ లోనే దాగి ఉంద‌ని నిరూపించింది. ఎరుపు వ‌ర్ణం దుస్తుల్లో రాశీ ధ‌గ‌ధ‌గ‌లాడిపోతుంది. నుదిటిన‌ పాపిడి బొట్టు..చెవుల‌కి రైన్ స్టోన్ జూకాల‌తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

బ్యాక్ గ్రౌండ్ రెడ్ క‌ల‌ర్ మ్యాచింగ్ ఆకర్ష‌ణ‌ను పెంచింది. రెండు చేతుల్లో దివ్వెతో దివాళీ అంతా త‌న‌దే అన్నంత‌గా హైలైట్ అయ్యింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. త‌న‌దైన శైలిలో ఇలా రాశీ దివాళీని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంది. ఇక రాశీ కెరీర్ ఆరంభంలో మ‌డిక‌ట్టుకుని కూర్చున్నా.. కాల‌క్ర‌మేణా గ్లామ‌ర్ ఎలివేష‌న్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది. సోష‌ల్ మీడియా యుగంలో టెంప్టింగ్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారులో గుబులు రేపింది రాశీ. బికీనీ..టూపీస్ లో రాశీ అందాల విందు చేసింది. రాశీ అందం.. గ్లామ‌ర్ యాంగిల్ ప్ర‌తిదీ యూత్ కి క‌నెక్ట‌యిపోయింది.

కెరీర్ ప‌రంగా చెప్పుకోద‌గ్గ భారీ విజ‌యాలు లేక‌పోయినా రాశీ అందంతోనే మంత్ర‌ముగ్దుల్ని చేస్తూ అవ‌కాశాలు ఒడిసిప‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల‌ తెలుగు..త‌మిళ్ లో క‌లిపి అర‌డ‌జ‌ను పైగా సినిమాలు చేస్తోంది. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా విక్ర‌మ్. కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `థాంక్యూ`లో న‌టిస్తోంది. అలాగే మ‌రో రెండు ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్లు స‌మాచారం.




Tags:    

Similar News