చిత్రం : ‘రాధ’
నటీనటులు: శర్వానంద్ - లావణ్య త్రిపాఠి - అక్ష - రవికిషన్ - కోట శ్రీనివాసరావు - ఆశిష్ విద్యార్థి - షకలక శంకర్ - బ్రహ్మాజీ - తనికెళ్ల భరణి - జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
మాటలు: చంద్రమోహన్ - కిరణ్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: చంద్రమోహన్
‘రన్ రాజా రన్’తో మొదలుపెట్టి ‘శతమానం భవతి’ వరకు వరుసగా నాలుగు హిట్లు కొట్టాడు యువ కథానాయకుడు శర్వానంద్. అతను కొత్త దర్శకుడు చంద్రమోహన్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘రాధ’. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి శర్వా జైత్రయాత్రను ‘రాధ’ కొనసాగించేలా ఉందో లేదో చూద్దాం పదండి.
కథ:
రాధాకృష్ణ (శర్వానంద్)కు చిన్నప్పట్నుంచి పోలీసవ్వాలని కోరిక. కొందరు నేరస్థుల్ని పట్టుకోవడంలో పోలీసు శాఖకు రాధాకృష్ణ సాయం చేయడంతో డీజీపీ తనకున్న ప్రత్యేక అధికారాలతో అతడిని ఎస్ఐ ఉద్యోగంలో నియమిస్తాడు. ముందు వరంగల్లో పోస్టింగ్ తీసుకున్న రాధాకృష్ణ.. అక్కడ రాధ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత అతడికి హైదరాబాద్ బదిలీ అవుతుంది. అక్కడ అధికార పార్టీలో మంత్రిగా ఉణ్న సుజాత (రవికిషన్) తర్వాతి ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా తనకు పోటీ లేకుండా చూసుకోవడం కోసం పన్నిన కుట్ర కారణంగా రాధ స్టేషన్లో పని చేసే కానిస్టేబుల్స్ బలి అవుతారు. ఈ కుట్ర గురించి తెలుసుకున్న రాధ.. తర్వాత ఏం చేశాడు.. సుజాత ఆట ఎలా కట్టించాడు.. మరోవైపు అతడి ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది... అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘రాధ’ సినిమాలో హీరో పాత్రధారి పదే పదే ‘నాకు మెటీరియల్ కావాలి’ అంటుంటాడు. ఏం చేయాలన్నా మెటీరియల్ ముఖ్యం అని చెబుతుంటాడు. ఐతే ‘రాధ’ సినిమాలో ఈ ముఖ్యమైన ‘మెటీరియలే’ మిస్సయింది. ఇందులో బలమైన కథ లేదు. ఎన్నోసార్లు వాడి అరిగిపోయిన రొటీన్ రివెంజ్ స్టోరీ ఎంచుకున్నాడు కొత్త దర్శకుడు చంద్రమోహన్. కథనం కూడా రొటీన్ గానే నడిచిపోతుంది. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో కామెడీ ఓ మోస్తరుగా వర్కవుటైంది. ఎంటర్టైన్మెంట్ వల్ల కొంత వరకు టైంపాస్ అయితే అవుతుంది కానీ.. ‘రాధ’ ఎక్కడా ఏమంత ఎగ్జైట్మెంట్ అయితే కలిగించదు. ప్రత్యేకమైన అనుభూతీ మిగల్చదు.
హీరో చూడ్డానికి జోకర్ లాగా కనిపిస్తాడు. విలన్ పక్కనే ఉంటూ అతడిని దెబ్బ తీస్తాడు. అతను మహా ముదురు అని చివర్లో తెలుస్తుంది. ఈ లైన్ వింటే శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’ గుర్తకు రాకమానదు. దాదాపుగా ఇదే లైన్లో సాగుతుంది ‘రాధ’. కాకపోతే ఇక్కడ హీరో పోలీస్. అంతే తేడా. కానీ ‘రన్ రాజా రన్’లో ఉన్నంత ఫన్.. అందులో ఉన్నన్ని మలుపులు ఇందులో మిస్సయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే ‘రన్ రాజా రన్’కు మరో వెర్షన్ లాగా అనిపిస్తుంది ‘రాధ’ చూస్తుంటే. ఇందులో ‘రన్ రాజా రన్’తో పాటు మరికొన్ని సినిమాల ఛాయలు కూడా కనిపిస్తాయి.
హీరోకు పోలీసవ్వాలని ఉంటుంది. అతనేదో కేసులో క్రిమిన్సల్ ను పట్టించాడని డీజీపీ అతడికి నేరుగా ఎస్సై ఉద్యోగం వేయించేస్తాడు. సినిమా ఇలా మొదలైనప్పుడే లాజిక్స్ గురించి పట్టించుకోకుండా సినిమా చూడాలని చెప్పకనే చెప్పేస్తాడు దర్శకుడు. ఐతే తనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ డోస్ ఇస్తే ప్రేక్షకులు లాజిక్కుల గురించేం పెద్దగా పట్టించుకోరనే భానవతో దర్శకుడు సరదా సన్నివేశాల్ని రాసుకున్నాడు. హీరో ఎస్సై ట్రైనింగ్ తీసుకునే ఎపిసోడ్.. ఆ తర్వాత హీరోయిన్ వెంటపడుతూ అల్లరి చేసే సన్నివేశాల్లో కామెడీ పండింది. ఆ సన్నివేశాలతో ఏం చెప్పదలుచుకున్నారన్నది పక్కన పెడితే కామెడీ మాత్రం ఓకే అనిపిస్తుంది.
తొలి గంట సరదాగా అలా అలా సాగిపోయే ‘రాధ’.. ఇంటర్వెల్ ముందు సీరియస్ టర్న్ తీసుకుంటుంది. విలన్ పాత్రలో ఏదో మర్మం ఉన్నట్లు చూపిస్తారు కానీ.. పరిచయ సన్నివేశాల నుంచి అతను కన్నింగ్ అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో కొత్తదనం ఏమీ లేదు. కాకపోతే ద్వితీయార్ధంలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి అయితే కలిగిస్తుంది. ద్వితీయార్ధంలో కొంచెం బిగువు ఉంటే.. ‘రాధ’ గట్టెక్కేసేవాడే. కానీ ఇక్కడి నుంచి కథనం మరీ రొటీన్ అయిపోతుంది.
విలన్ పక్కనే అమాయకుడిలా నటిస్తూ.. హీరో అతణ్ని దెబ్బ తీయడం.. ప్రి క్లైమాక్సులో విలన్ కు విషయం అర్థమైపోయి హీరోను దెబ్బ తీయడం.. చివర్లో హీరో రివర్స్ అయి విలన్ కు చెక్ పెట్టడం.. అంతా రొటీన్ వ్యవహారమే. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్దంలో కామెడీ డోస్ తగ్గింది. సప్తగిరి చేసిన ‘నాన్నకు ప్రేమతో’ స్పూఫ్ పర్వాలేదు. దీంతో ప్రథమార్ధంతో ఓకే అనిపించే ‘రాధ’.. ద్వితీయార్ధంలో డౌన్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే ‘రాధ’ కామెడీ వరకు మెప్పించినా.. కథాకథనాల విషయంలో నిరాశ పరుస్తుంది. లాజిక్కుల గురించి.. కథాకథనాల గురించి పట్టించుకోకుండా కామెడీని ఎంజాయ్ చేయగలిగితే ‘రాధ’ ఓకే అనిపిస్తుంది.
నటీనటులు:
శర్వానంద్ ను చూస్తుంటే పదే పదే ‘రన్ రాజా రన్’.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలు గుర్తుకొస్తాయి. అతడి నటన ఆ సినిమాలకు కొనసాగింపులా అనిపిస్తుంది. కొత్తదనం ఏమీ లేదు. ఐతే ఉన్నంతలో శర్వానే ‘రాధ’కు బలం అని చెప్పాలి. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి నటించే అవకాశం పెద్దగా రాలేదు. ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ఐతే లావణ్య ఇంతకుముందు ఏ సినిమాలో కనిపిచనంత గ్లామరస్ గా కనిపించింది ఇందులో. రాబిట్ పిల్లా పాటలో ఆమె అందాలు ప్రత్యేక ఆకర్షణ. లావణ్య గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్. అక్ష గురించి చెప్పడానికేమీ లేదు. విలన్ పాత్రలో రవికిషన్ ఓవరాక్షన్ చేశాడు. షకలక శంకర్ బాగా చేశాడు. సప్తగిరి.. ఆలీ.. కోట శ్రీనివాసరావు.. ఆశిష్ విద్యార్థి.. తనికెళ్ల భరణి.. జయప్రకాష్ రెడ్డి.. వీళ్లంతా మామూలే.
సాంకేతికవర్గం:
‘అందాల రాక్షసి’ ఫేమ్ రధన్.. నిరాశ పరిచాడు. అతడి స్టయిల్లో ఫీల్ ఉన్న మ్యూజిక్ ఇవ్వడానికి ‘రాధ’లో అవకాశం లేకపోయిందేమో. ఈ తరహా ఎంటర్టైనర్లకు సూటయ్యే సంగీతాన్నందించలేకపోయాడు. పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. మాటలు ఏమంత ప్రత్యేకంగా లేవు. నిర్మాణ విలువలు ఓకే. రైటర్ కమ్ డైరెక్టర్ చంద్రమోహన్ దర్శకుడిగా తన ముద్ర వేసే ప్రయత్నమేమీ చేయలేదు. తొలి చిత్ర దర్శకుడి నుంచి ఆశించే కొత్తదనం అతను అందించలేకపోయాడు. చాలా వరకు పాత సినిమాల అనుకరణే కనిపిస్తుంది. రొటీన్ కథను ఎంచుకున్న అతను... స్క్రీన్ ప్లేలో అంత వేగం చూపించలేకపోయాడు. కామెడీ వరకు పర్వాలేదనిపించాడు.
చివరగా: రాధ.. రొటీన్ గా వాయించేశాడు
రేటింగ్- 2.5/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre