నెమలికి నాట్యం నేర్పించడం బావుంటుందా? పురి విప్పి ఎలా ఆడాలా నేర్పించాలా? కానీ శ్యామ్ అనే ప్రేమికుడు ఏదైనా నేర్పించగలడు! ఘాడమైన ప్రేమైకంలో ఉన్న శ్యామ్ తన రాధకు ప్రేమ పాఠాలు నేర్పించడంలో ఎప్పుడూ బిజీగానే ఉన్నాడు. సంగీత పాఠం అంటాడు.. కానీ ప్రేమ పాఠం నేర్పిస్తాడు.. అదే కదా శ్యామ్ ప్రత్యేకత!!
యూరోప్ వీధుల్లో బస్సులు ఎక్కినా.. టన్నెల్స్ గుండా వెళ్లే అల్ట్రా రిచ్ రైలు ఎక్కినా కానీ అతడిలో ప్రేమ పరవశం ఎప్పుడూ మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటుంది. డీప్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో రూపొందించిన రాధేశ్యామ్ ని ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి 2022 కి మాత్రమే రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్సయ్యారు. ఈ సినిమాకి విజువల్ గ్రాఫిక్స్ వర్క్ కోసమే ఎక్కువ సమయం కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా క్రైసిస్ నెమ్మదించినా కానీ.. ఇప్పట్లో రిలీజ్ చేసే మూడ లో లేమని యువిక్రియేషన్స్ అధినేతలు చెప్పేశారు.
తాజాగా రిలీజ్ చేసిన రాధేశ్యామ్ ప్రమోషనల్ పోస్టర్ యువహృదయాలను ఘాడంగా హత్తుకుంటోంది.శ్యామ్ అంటే లార్డ్ కృష్ణ అని అర్థం. ఇక్కడ మోడ్రన కృష్ణుడిలా ప్రభాస్ ఎంతో ఛామింగ్ గా కనిపిస్తున్నాడు. తన రాధతో మురిపెంగా ముచ్చట్లాడుతున్నాడు. తాహతుతో పని లేకుండా ఒక పేద యువతిని ప్రేమించే అల్ట్రా రిచ్ బిజినెస్ మేన్ గా ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించనున్నారు. పోస్టర్ లో అతడి ముందు మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ప్రేయసి రాధ ఎంతో ముగ్ధ మనోహర రూపంతో మైమరిపింపజేస్తోంది. అందమైన నెమలి పింఛపు తల్పంపై కూచుని రాధ అలా సంగీత రసాస్వాధనలో మునిగి తేలుతుంటే తన్మయత్వంలో ప్రేమికుడు శ్యామ్ ఎలా మురిపెంగా కనిపిస్తున్నాడో చూస్తున్నారు కదా..!
ప్రేమకులంలో పుట్టిన ప్రేమికులకు కులమత ప్రాంత భేధాలేవీ లేవు. కేవలం లవ్ లవ్ అంటూ లబ్ డబ్ వినిపిస్తుంది తప్ప ఇంకేదీ సంగీత ధ్వనిలో కూడా వినిపించదు అని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. జిల్ ఫేం రాధాకృష్ణకుమార్ సెల్యూలాయిడ్ ప్రేమకవనాన్ని ఎంతో అద్భుతంగా మనోహరంగా తీర్చిదిద్దారనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఈ ఏడాది రాధేశ్యామ్ థియేటర్లలోకి రాకపోవడంతో ప్రభాస్ అభిమానులంతా అలిగిన సంగతి తెలిసిందే. అయినా కానీ 2022 సంక్రాంతి వరకూ వేచి ఉండక తప్పదు.