దూసుకొస్తున్న రెండు క‌త్తులు...రాధేశ్యామ్‌.. ఆర్ ఆర్ ఆర్‌

Update: 2022-03-02 08:31 GMT
ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వంటారు అందుకేనేమో మ‌న వాళ్లు ఒకే సారి బాక్సాఫీస్ పై రెండు క‌త్తుల్ని దూయ‌డానికి వెన‌కూడుతుంటారు. ఇద్ద‌రు త‌ల‌ప‌డితే గెలిచేది ఒక్క‌రే కాబ‌ట్టి. అలా కాకుండా ఎవ‌రి దారిలో వాళ్లొస్తే అదీ రెండు వారాల గ్యాప్ తో వ‌స్తే థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ జాత‌ర మామూలుగా వుండ‌దు. అభిమానులు పూన‌కాల‌తో రెచ్చిపోవ‌డం ఖాయం. ఇప్పుడు ఇదే ఈ ఫార్ములాని పాటిస్తూ పాన్ ఇండియా మూవీస్ రాధేశ్యామ్‌, ఆర్ ఆర్ ఆర్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి.

ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్` ముందుగా మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఇదే నెల‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `ఆర్ ఆర్ ఆర్‌` వ‌ర‌ల్డ్ వైడ్ గా దాదాపు 14 భాష‌ల్లో విడుద‌ల కానుంది.  మార్చి 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా మూవీసే కావ‌డం, అందులోనూ రెండు వారాగా వ్య‌వ‌ధిలో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. ముందు ఈ రెండు చిత్రాల్ని జ‌న‌వ‌రికి సంక్రాంతి బ‌రిలోకి దింపాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు.

అయితే అప్పుడు `ఆర్ ఆర్ ఆర్‌`ని ముందుగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయాల‌నుకున్నారు. `రాధేశ్యామ్‌` ని జ‌న‌వ‌రి 14న పండ‌గ రోజే థియేట‌ర్ల‌లోకి దించేయాల‌నుకున్నారు. వారం వ్య‌వ‌ధి మాత్ర‌మే డెడ్ లైన్ ఖ‌రారైంది. అయితే ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు ఒమిక్రాన్‌, క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అనూహ్యంగా ఈ రెండు చిత్రాల‌ని వాయిదా వేశారు. మ‌ళ్లీ ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఒకే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌టం విశేషం.

అయితే ఈ సారి వారం గ్యాప్ తో కాకుండా రెండు వారాల గ్యాప్ తో ఈ సినిమాలు పోటీప‌డబోతున్నాయి. `రాధేశ్యామ్` ముందుగా మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, `ఆర్ ఆర్ ఆర్‌` రెండు వారాలు ఆల‌స్యంగా మార్చి 25న విడుద‌ల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 300 కోట్ల గ్రాస్ ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. ఇది ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల త‌రువాత బిగ్ టికెట్ సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డికి రెడీ కావ‌డంతో భారీ స్థాయిలో ప్రారంభ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

`రాధేశ్యామ్‌` విధికీ - ప్రేమ‌కు మ‌ధ్య సాగే స‌మ‌రం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. రొమాంటిక్ హెరిటేజ్ ల‌వ్ స్టోరీగా పిరియాడిక్ నేప‌థ్యంలో 1970వ ద‌శ‌కంలో సాగే క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందించ‌డం, విజువ‌ల్ వండ‌ర్ గా సినిమా వుండ‌బోతోంద‌నే సంకేతాల్ని అందించ‌డంతో `రాధేశ్యామ్‌` చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక `ఆర్ ఆర్ ఆర్‌` విష‌యానికి వ‌స్తే ఈ మూవీ 1920 కాలం నాటి ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేప‌థ్యంలో సాగ‌నుంది.

ఫ్రీడ‌మ్ కోసం రియ‌ల్ హీరోస్ అల్లూరి సీతారామ‌రాజు, గోండు బెబ్బులి కొమ‌రం భీం ల రియ‌ల్ క‌థ‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ని జోడించి తెర‌కెక్కించిన సినిమా ఇది. ఇందులో తొలిసారి రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టించ‌డంతో ఈ మూవీపై కూడా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీంతో రెండు వారాల వ్య‌వ‌ధిలో బాక్సాఫీస్ వ‌ద్ద పాన్ ఇండియా మూవీస్ జాత‌ర జ‌ర‌గ‌బోతోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News