ప్రభాస్ భారీ బడ్జెట్ లవ్ డ్రామా `రాధే శ్యామ్` అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రేరణతో విక్రమాదిత్య ప్రేమకథ ఎలా ఉండనుందో వీక్షించనున్నారు అభిమానులు. హస్తసాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ పెర్ఫామెన్స్ .. ప్రేరణతో ప్రేమాయణం సినిమా ఆద్యంతం హైలైట్ గా ఉండనున్నాయని అర్థమవుతోంది. కొన్ని గంటల్లోనే మూవీ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో అత్యంత భారీగా విడుదల కానుంది.
అయితే రిలీజ్ ముంగిట బిగ్ ట్విస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకిస్తోంది. సొంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలో రాధే శ్యామ్ సినిమాని తక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారనేది టాక్. ప్రస్తుతం ఈ చిత్రాన్ని జంట తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 860 థియేటర్లలో విడుదల చేయనున్నారు.
రేపు సినిమా విడుదలకు సిద్ధమవుతున్నందున ఈ రోజు తర్వాత సంఖ్య స్వల్పంగా పెరగవచ్చు. ప్రస్తుతానికి రాధే శ్యామ్ భీమ్లా నాయక్ .. పుష్ప.. అఖండ (వెయ్యి మించారు) కంటే తక్కువ స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతానికి మార్కెట్లో పోటీ లేదు. ప్రభాస్ సోలోగానే వస్తున్నాడు. కోవిడ్ భయాలు లేవు.. టికెట్ రేట్లు కొలిక్కి వచ్చాయి. సూర్య ఈటీ అస్సలు పోటీ కానేకాదు.. భీమ్లా నాయక్ ఫుల్ రన్ పూర్తయింది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా కానీ రాధేశ్యామ్ తక్కువ థియేటర్లలో రిలీజ్ కావడానికి కారణమేమిటీ? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. థియేటర్ల సంఖ్యను అమాంతం పెంచాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
గ్రిప్ పెంచుకుని మరీ బరిలోకొచ్చాడు!
రిలీజ్ ముంగిట రాధేశ్యామ్ కోసం టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందే `రాధేశ్యామ్` మేకర్స్ స్వచ్ఛందంగా సినిమాను 12 నిమిషాలు కుదించారని టాక్ వినిపించింది. ఈ సినిమా నిడివి 138 నిమిషాలు అని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి-ది బిగినింగ్ (2015)లో తన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
బాహుబలి 2 - ది కన్‌క్లూజన్ (2017)తో అతను మరింత ఎత్తుకు ఎదిగి పాన్-ఇండియా సూపర్ స్టార్ గా మారాడు. ఇది అతని తదుపరి చిత్రం సాహో (2019) భారీ ఓపెనింగ్ లో ప్రతిబింబించింది. ఫలితంగా అతని తదుపరి చిత్రం `రాధే శ్యామ్`పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ బహుభాషా చిత్రం విజువల్ గ్రాండియారిటీ ఇప్పటికే అంచనాల్ని మరింతగా పెంచేసింది. స్కేల్ పరంగా ఇది పెద్ద స్క్రీన్ కోసం ఉద్దేశించిన చిత్రం అని ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ చిత్రానికి జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రాధే శ్యామ్ కథాంశం ఆసక్తిని రేకెత్తించేవిధంగా రూపొందించారట. ఒక రహస్యమైన హస్తసాముద్రికుడి కథను తెరపై ఆయన ఆవిష్కరించారు. ఇది 1970 కాలంలో సాగుతుంది. రాధే శ్యామ్ మల్టీప్లెక్సుల్లో పెద్ద హిట్టవుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో టికెట్ రేట్లను పెంచడం ప్రభాస్ రాధేశ్యామ్ కి ఎంతో కలిసి రానుంది.