300 మంది కార్మికుల‌తో పురాత‌న దేవాయంలో `రాధేశ్యామ్`

Update: 2021-09-10 06:49 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కథానాయ‌కుడిగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్- టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాయి. అత్యంత‌ భారీ కాన్వాస్ పై ఈ ప్రేమ‌క‌థా చిత్రం తెర‌కెక్కుతోంది. 1975 బ్యాక్ డ్రాప్ లో యూర‌ప్ నేప‌థ్యంలో సాగ్ పీరియాడిక్ చిత్ర‌మిది. ఇందులో అంద‌మైన ల‌వ్ స్టోరీని ద‌ర్శ‌కుడు హైలైట్ చేస్తున్నారు. ఓ వైపు భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ని ప‌తాక స్థాయిలో చూపిస్తూనే 1975 కాలానికి తీసుకెళ్లే అద్భుత‌మైన సెట్స్ ని కూడా అంతే హైలైట్ చేస్తున్నారు. దేశ‌..విదేశాల్లో అంద‌మైన ఎగ్జాటిక్ లోకేష‌న్స్ న‌డుమ చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. యూర‌ప్ అందాలు మైమ‌రిపింపజేస్తాయ‌న్న టాక్ ఉంది. తాజాగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి లీకైంది.

చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఓ పురాత‌న‌మైన దేవాలయ‌లో ఏకంగా ప‌ది రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసారుట‌. ఇందులో 100 పురోహితులు కూడా భాగ‌మైనట్లు స‌మాచారం. ఈ షూట్ కోసం దాదాపు 300 మంది కార్మికులు ప‌నిచేసారుట‌. దేవాల‌యం షూట్ కోసం ఇప్ప‌టివ‌ర‌కూ ఇంత మంది క్రూ ఏ సినిమాకు ప‌నిచేయ‌లేదు. అలాగే ఇన్ని రోజుల పాటు చిత్రీక‌ర‌ణ కూడా జ‌ర‌గ‌లేదు. ఆ ర‌కంగా ఆ స‌న్నివేశాల‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్ధ‌మ‌వుతోంది. ఇందులో ప్ర‌భాస్..పూజా హెగ్డే స‌హా కీల‌క న‌టులంతా ఈ షూట్ లో పాల్గొన్నారు. పురాత‌న దేవాల‌యంలో షూట్ కి అవ‌స‌ర‌మైన సెట‌ప్ అంతా హైద‌రాబాద్ ని త‌ర‌లించారు.

అంటే ఇక్క‌డ య‌జ్ఞ యాగాలు..క్ర‌తువుల‌కు సంబంధించిన స‌న్నివేశాలు భారీ స్థాయిలో 100 మంది పురోహితుల స‌మ‌క్షంలో షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌న్నివేశాలు కూడా సినిమాలో అంతే హైలైట్ కానున్నాయి. అయితే ఏపీలోని ఆ దేవాల‌యం పేరును గానీ..ప్రాంతాన్ని గానీ యూనిట్ ఎక్క‌డా లీక్ చేయ‌లేదు. నేరుగా సినిమాలో చూసి థ్రిల్ ని అందించేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాధేశ్యామ్ షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `స‌లార్`..`ఆది పురుష్` చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఆదిపురుష్‌.. స‌లార్ ల‌ను మించేలా మ‌రొక‌టి

డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే వ‌రుస‌గా మూడు సినిమాల్ని ప్రారంభించాడు. రాధేశ్యామ్ సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతుండ‌గా.. స‌లార్ -ఆదిపురుష్ 3డి చిత్రాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప‌నిలో ప‌నిగా నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీని ప్రారంభించి షెడ్యూళ్ల‌కు స‌హ‌క‌రిస్తున్నాడు.

ఇంత‌లోనే ప్ర‌భాస్ న‌టించే 25వ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యం రివీలైంది. ఈ సినిమాని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తారు. ప్ర‌భాస్ తో డార్లింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తీశాక దిల్ రాజు మ‌రో సినిమా చేయాల‌ని ఎంతో కాలంగా వేచి చూస్తున్నాడు. అందుకే ఈసారి యువి క్రియేష‌న్స్ ని ప‌క్క‌న‌పెట్టి దిల్ రాజు కు 25వ సినిమా ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. ఇప్ప‌టికే టైటిల్ ఫైన‌లైంద‌ని క‌థ‌నాల‌స్తున్నాయి. `వ్రిందావన` అనే టైటిల్ ని ఫిలింఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించిన దిల్ రాజు పాన్ ఇండియా కేట‌గిరీలో క‌థాంశాన్ని సిద్ధం చేయించాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్రభాస్ తో దిల్ రాజు 2023 చివరలో ఈ సినిమాను ప్రారంభిస్తార‌ట‌. ద‌ర్శ‌కుడు క‌థానాయిక ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది. వ్రిందావన ... చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న‌ ఉత్తర ప్రదేశ్ మథుర జిల్లాలోని ఒక పట్టణం పేరు. శ్రీ కృష్ణ భగవానుడు తన బాల్యాన్ని ఇక్క‌డే గ‌డిపాడు. కృష్ణ భగవానుని జన్మ స్థలమైన మథుర నుండి 15 కి.మీ. దూరంలో వ్రిందావన ఉంది.



Tags:    

Similar News