బాలయ్య సరసన వరుసగా రెండు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది ఈ అమ్మడు. రెండిటిలో సాంప్రదాయ బద్ధమైన తెలుగమ్మాయిలా కనిపించింది. కానీ ఇదే భామ బాలీవుడ్ వెళ్లేప్పటికి వలువలు విప్పి సెమీ న్యూడ్ సన్నివేశాల్లో జీవించేస్తుంది. క్వయిట్ అపోజిట్‌గా కనిపిస్తూ కవ్విస్తోంది. ఈ 'రాధికా ఆప్టే' ఉంది చూశారూ.. అమ్మో మనం చూసేంత అమాయకురాలేం కాదు.
రెబల్ క్యాండిడేట్. ఇక్కడ పక్కా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంది. బాలీవుడ్ వెళితే క్లీవేజ్ షోలతో రెచ్చిపోతుంది. అప్పట్లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలోని ఓ లఘుచిత్రంలో పూర్తి వల్గర్ దృశ్యాల్లో జీవించింది. ఆ వీడియోలు నెట్లో సంచలనమయ్యాయి. ఇప్పుడు 'అహల్య' టైటిల్‌తో మరో లఘుచిత్రం ఆన్లైన్లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. అసలు రామాయణంలో అహల్యకు ఈ అహల్యకు తేడా ఏంటో తెలియాలంటే ఈ లఘుచిత్ర టీజర్ చూడాల్సిందే. స్వర్గంలో ఇంద్రుడు చాలా చిలిపి కుర్రాడు. అతడి వద్ద ఓ మ్యాజిక్ రాయి ఉండేది.. అంటూ విజువల్స్‌లో చాలా మ్యాజిక్‌నే చూపించారు.
ముఖ్యంగా రాధికా ఆప్టే షార్ట్ డ్రెస్సుల్లో మతి చెదరగొట్టింది. దేహానికి అతుక్కుపోయిన టైట్ఫిట్ని చూస్తే మతి చెడాల్సిందే ఎవరికైనా. రాధిక చూపుల్లో కవ్వింత, నడక, నడతలో కవ్వింత కిక్కు రప్పిస్తోంది. 14 నిమిషాల ఈ లఘుచిత్రం వారంలో ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన వీడియో ఇది. ప్రస్తుతం యువతరం యాప్‌లలో టీజర్ హల్చల్ చేస్తోంది.