రాధికా ఆప్టే ఈసారి వాళ్లపై పడింది

Update: 2015-07-26 06:22 GMT
టాలీవుడ్ లో పురుషాధిక్యత ఎక్కువ.. ఇక్కడ హీరోయిన్లను తక్కువగా చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మన ఇండస్ట్రీ నుంచి సెలవు తీసేసుకుంది రాధికా ఆప్టే. పర్టికులర్ గా టాలీవుడ్ గురించే అలాంటి వ్యాఖ్యలు చేసిందంటే.. మిగతా ఇండస్ట్రీల మీద ఆమెకు మంచి అభిప్రాయం ఉందేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడామె బాలీవుడ్ మీద కూడా విరుచుకుపడింది.

హీరోయిన్లంటే బాలీవుడ్ వాళ్లకు కూడా చిన్నచూపేనని.. పారితోషకం చాలా తక్కువ ఇస్తారని.. ఆమె విమర్శించింది. క్వీన్, తను వెడ్స్ మను, పీకూ లాంటి హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాలు అద్భుత విజయాలు సాధిస్తున్నా... హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి మంచి వసూళ్లు వస్తున్నా.. అమ్మాయిలకిచ్చే పారితోషకం మాత్రం చాలా తక్కువ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘బాలీవుడ్ లో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషకం చాలా తక్కువ. హిందీ పరిశ్రమలో హీరోయిన్లను చిన్నచూపు చూస్తున్నారు. ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు.. మిగతా చోట్ల కూడా పరిస్థితి అలాగే ఉంది. సినిమాలు కేవలం మగవాళ్ల వల్లే పూర్తికావు. వాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉండాల్సిందే. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా వంద కోట్ల మార్కును అందుకున్నాయి. ఈ మార్పు పారితోషకాల్లో కూడా ఉండాలి. హీరోయిన్లే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వివక్షకు గురవుతున్నారు’’ అని చెప్పింది రాధిక.
Tags:    

Similar News