ఫోటో స్టొరీ: కిల్లర్ ఫ్యాషన్ ఎట్ వోగ్

Update: 2019-09-27 04:29 GMT
రాధిక ఆప్టే.  అసలేమాత్రం ఇంట్రో అవసరం లేని హాటు బ్యూటీ పేరు. యాక్టింగ్.. బోల్డ్ నెస్ అన్నీ సమపాళ్లలో ఉన్న అతి తక్కువమంది హీరోయిన్లలో ఒకరు.  రాధిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ కావడంతో రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తుంది. ఆ ఫోటోలతో నెటిజన్లను రాచి రంపాన పెడుతూ ఉంటుంది.  ఈరోజు మరోసారి అదే పని చేసింది.

రాధిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "ఎబౌట్ లాస్ట్ నైట్ #వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2019" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  సాధారణంగానే ఆప్టే యమా హాటు.  వోగ్ వారు బ్యూటీ అవార్డ్స్ ఇస్తే ఇక ఊరుకుంటుందా? ఒక కత్తి లాంటి డ్రెస్ ధరించి హాజరయింది. స్లీవ్ లెస్.. డీప్ వీ నెక్ తో అందాల ప్రదర్శన పీక్స్ లో చేసింది.  యాక్సెసరీస్ లేవు కానీ పెదవులకు మాత్రం డార్క్ లిప్ స్టిక్ ధరించి ఫ్యాషనిస్టా తరహాలో పోజిచ్చింది. హెయిర్ స్టైల్ కూడా మామూలుగా లేదు.. అదిరిపోయింది.

అందుకే ఈ ఫోటోకు టాలీవుడ్ బ్యూటీ సమంతా కూడా "స్టన్నింగ్" అంటూ ఒక కామెంట్ పెట్టింది. ఇక సాధారణ నెటిజన్ల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "కిల్లర్ ఫ్యాషన్".. "రాధిక ఆప్టే విండోస్".. "సెక్సీ అండ్ స్టన్నింగ్" అంటూ కామెంట్లు పెట్టారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాధిక ఏ సినిమా సైన్ చేయలేదు.  రాధిక ఈమధ్య 'ది వెడ్డింగ్ గెస్ట్'.. 'ది ఆశ్రమ్' అనే రెండు ఇంగ్లీష్ మూవీస్ లో నటించింది.
Tags:    

Similar News