పుష్ప-2 టీమ్.. నిద్రలేని రాత్రలు..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప-2పై ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప-2పై ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఉన్న బన్నీ అభిమానులతో పాటు అనేక మంది సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పుష్పరాజ్ మ్యాజిక్ ను మళ్లీ చూసేందుకు తహతహలాడుతున్నారు.
అదే సమయంలో ఆడియన్స్ లో ఇప్పటికే క్రియేట్ అయ్యి ఉన్న అంచనాలను మేకర్స్ రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. వేరే లెవెల్ లో బజ్ సృష్టిస్తున్నారు. వరుస ఈవెంట్స్ తో సందడి చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో కండక్ట్ చేశారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు, ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసిన మేకర్స్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే సునీల్, అనసూయ తదితరులు తమ డబ్బింగ్ ను పూర్తి చేసేశారు. సినిమా రిలీజ్ కు టైమ్ చాలా తక్కువ ఉండడంతో శరవేగంగా పని చేస్తున్నారు మేకర్స్.
డైరెక్టర్ సుకుమార్, దేవిశ్రీప్రసాద్ తో పాటు మరికొందరు టెక్నీషియన్స్ సినిమా కోసం నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆడియన్స్ కు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడమే టార్గెట్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మామూలుగా కష్టపడడం లేదుగా అని అంతా కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. మూడేళ్ల క్రితం వేరే లెవెల్ హిట్ గా నిలిచిన పుష్ప మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పార్ట్ 2లో కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీవల్లి 2.0గా సందడి చేయనున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ కిస్సిక్ లో మెరవనున్నారు.
మూవీలో మాలీవుడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్, అనసూయ, శ్రీతేజ్ సహా పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న కనీవినీ ఎరుగని స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. మరి పుష్ప సీక్వెల్ ఎలాంటి హిట్ అవుతారో వేచి చూడాలి.